• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కాంగ్రెస్ లో కలకలం.....

కాంగ్రెస్ లో కలకలం.. బాధపడ్డ ఉత్తమ్

By - Tupaki Desk
Update: 2019-12-26 11:43 GMT
మున్సిపల్ ఎన్నికల గురించి గాంధీభవన్ లో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం రసాభాసాగా మారింది. సమావేశాన్ని ముందే కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు బహిష్కరించారు. కాంగ్రెస్ కోర్ కమిటీనికి సంబంధం లేని వారిని పిలిచారని బహిష్కరించిన వీహెచ్ తీరుతో కలత చెందిన ముఖ్య నేతలు షాకయ్యారు.

కోర్ కమిటీ సమావేశంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది. మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు కెక్కి పోరాడుతున్న తనపై టీఆర్ ఎస్ నేతలు మాటల దాడి చేస్తుంటే స్పందించరా అని ఉత్తమ్ కాంగ్రెస్ నేతలను నిలదీసినట్టు తెలిసింది. కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులను ఉత్తమ్ నిలదీసినట్టు తెలిసింది.

దీనికి కౌంటర్ ఇచ్చిన సీనియర్ నేత షబ్బీర్ అలీ ఏకంగా పీసీసీ ఉత్తమ్ తీరును ఎండగట్టినట్టు తెలిసింది.. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్ బీసీలు - రెడ్లుగా చీలిపోయిందని ఉత్తమ్ ఆధిప్యతాన్ని ప్రశ్నించినట్టు తెలిసింది.

కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన ఇన్నేళ్లలో ఉత్తమ్ ఇలా ఆవేదన ఎప్పుడూ చెందలేదని.. అందరినీ కలుపుకొని పోయే ఉత్తమ్ తొలిసారిగా తన ఆవేదనను - ఆందోళనను బయటపెట్టారని నేతలు చెబుతున్నారు. ఉత్తమ్ ఆవేదన ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది.  మున్సిపల్ ఎన్నికల వేళ వారి అసహాయతను ఎత్తి చూపుతోంది.
Tags:    
  • Uttam Kumar Reddy 
  • Telangana Congress Party Leaders 

Similar News

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

Copyright @2026

Powered by Blink CMS