ఆ అమెరికన్ గండిపేట రిజర్వాయర్ ప్రాంతంలో ఎలా మరణించాడు?

Update: 2020-05-19 05:15 GMT
కలకలం రేగింది. హైదరాబాద్ మహా నగరంలో నివసించే అమెరికన్ ఒకరు గండిపేట గుట్టల్లో చనిపోయి ఉండటం సంచలనంగా మారింది. అతడు ఎవరు? ఎందుకు అక్కడికి వచ్చాడు? అతడి మరణానికి కారణం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సదరు అమెరికన్ ప్రమాదవశాత్తు మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అమెరికాకు చెందిన 38 ఏళ్ల జాన్ రాబర్ట్ పాల్ తన భార్య యాంజలీనాతో కలిసి గచ్చిబౌలిలో ఉంటున్నారు. రాబర్ట్ సతీమణి హైదరాబాద్ లోని ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. రాబర్ట్ సైక్లింగ్ హాబీ ఉంది. తరచూ సైక్లింగ్ కోసం కిలోమీటర్ల కొద్ది ప్రయాణిస్తుంటారు. ఆ అలవాటే ఆయన ప్రాణాలు పోవటానికి కారణమైందా? అన్నది క్వశ్చన్ గా మారింది. ఎందుకంటే.. ఉదయానే సైక్లింగ్ లో భాగంగా ఇంటి నుంచి సైకిల్ తీసుకొని బయటకు వచ్చిన రాబర్ట్.. గండిపేట రిజర్వాయర్ ప్రాంతం వరకూ వెళ్లారు.

ప్రమాదవశాత్తు కిందపడి మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఉదయాన్నే సైక్లింగ్ కోసం బయటకు వెళ్లిన భర్త తిరిగి ఇంటికి రాకపోవటంతో ఆమె పలుమార్లు ఫోన్లో కాంటాక్టు చేశారు. అయినా.. సమాదానం లేకపోవటంతో పోలీసుల్ని ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు.. ఫోన్ సిగ్నల్స్ అధారంగా రాబర్ట్ డెడ్ బాడీని గుర్తించారు. సైక్లింగ్ చేసే సమయంలో పొరపాటున జారిపడటంతో కానీ.. అనుకోని రీతిలో వచ్చిన అనారోగ్యంతో కానీ మరణించి ఉంటారని భావిస్తున్నారు.
Tags:    

Similar News