అమెరికాలో కాల్పులు.. 8 మంది మృతి
అగ్రరాజ్యమైన అమెరికా కాల్పుల ఉదంతంతో ఉలిక్కి పడింది. మిసిసిపీ రాజధాని జాక్సన్‌కు 109 కిలోమీటర్ల దూరాన ఉన్న లింకన్ కౌంటీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న బ్రూక్ హవెన్.. బొగ్యు చిట్టొల్లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఒక కుటుంబంలో చోటు చేసుకున్న విభేదాలే దారుణ కాల్పులకు కారణం కావటమే కాదు.. ఏకంగా ఎనిమిది మంది ప్రాణాలు పోయే విషాదంగా మారాయని చెబుతున్నారు.
మిసిసిపీ పోలీసు అధికారి వారెన్ స్ట్రైన్ కథనం ప్రకారం.. పిల్లల విషయమైన భార్య.. ఆమె తల్లిదండ్రులతో గొడవ పడిన కోరీ గాడ్ బోల్ట్ అనే 35 ఏళ్ల వ్యక్తి కాల్పుల దారుణానికి తెర తీశారని చెబుతున్నారు. కాల్పులు మొత్తం మూడు ఇళ్లల్లో చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
ఎనిమిది మంది ప్రాణాలు తీసిన నిందితుడు గాడ్ బోల్డ్ వాదన ప్రకారం తన భార్య.. ఆమె సవతి తండ్రి.. తల్లితో పిల్లల్ని తీసుకెళ్లే విషయం మీద మాట్లాడుతున్నానని.. ఆ సమయంలో ఎవరో పోలీసులకు ఫోన్ చేశారని.. సంబంధం లేని వారు జోక్యం చేసుకోవటంతో ఈ దారుణానికి పాల్పడినట్లుగా పేర్కొన్నారు.
ఇంత దారుణం చేసిన తర్వాత తాను బతకానికి అనర్హుడినని తాను భావిస్తున్నట్లుగా నిందితుడు చెబుతున్నట్లుగా మీడియాకథనాలు బయటకు వచ్చాయి. నిందితుడికి గతంలో నేర చరిత్ర ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. కాల్పులకు కారణమైన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ దారుణం జరగటానికి కారణమైన అంశాల్ని విచారిస్తున్నారు. పోలీసుల దర్యాఫ్తు అనంతరం మొత్తం వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/