ఫైజర్ వ్యాక్సిన్ ... డిసెంబర్ లో ఇవ్వడానికి సిద్దమౌతున్న అమెరికా ప్రభుత్వం !

Update: 2020-11-11 10:30 GMT
కరోనపై పోరులో కీలక విజయం సాధించినట్టు అమెరికన్‌ ఫార్మా కంపెనీ ఫైజర్‌ ప్రకటించింది. వ్యాక్సిన్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమైనట్టు ఫైజర్‌ ప్రకటించింది. తమ వ్యాక్సిన్‌ కరోనా రాకుండా 90 శాతం నియంత్రణ ఇస్తుందని స్టేట్‌ మెంట్‌ విడుదల చేసింది. మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా ఏడురోజుల్లో వాలంటీర్లకు వ్యాధి నిరోధక శక్తి వచ్చినట్టు వెల్లడించింది. తొలిదశలో వ్యాక్సిన్‌ వేసుకున్న వాలంటీర్లలో 28 రోజుల తరువాత ఇమ్యూనిటీ పవర్‌ వచ్చినట్టు వివరణ ఇచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా వణికిపోతున్న ప్రపంచ ప్రజలకు ఇది గుడ్‌ న్యూస్‌ అని ఫైజర్‌ ప్రకటించింది. ప్రస్తుతం ఫైజర్‌ సంస్థ 50 మిలియన్‌ డోసుల వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. 2021 నాటికి 1.3 బిలియన్‌ డోస్‌లను తయారు చేస్తామని తెలిపింది.

ఈ డోస్ లను అమెరికాతో పాటు యూకే, జపాన్ తదితర దేశాల్లో ఇప్పటికే తాము చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా పంచాలని ఫైజర్ భావిస్తోంది. ఇండియాకు సంబంధించినంత వరకూ ఫైజర్ తో ఇంతవరకూ ఎటువంటి ఒప్పందమూ కుదరలేదు. వ్యాక్సిన్ ను ఇండియాకు తెచ్చేలా ఒప్పందం కుదిరితే, వినియోగానికి అనుమతించే ముందు లోకల్ ట్రయల్స్ ను నిర్వహించాలని ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఈ వ్యాక్సిన్ ను మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాల్సి వుండగా, ఇండియాలో వ్యాక్సిన్ నిల్వకు అవసరమైన మౌలిక వసతులపై కొన్ని అనుమానాలను వైద్య ఆరోగ్య రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.ఈ  టీకా ఆర్ఎన్ఏ ఆధారంగా తయారైనది కావడంతో అత్యంత శీతల వాతావరణంలోనే భద్రపరచాల్సి వుంటుంది. దీంతో కోల్డ్ చైన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పై ప్రభుత్వం మరింత దృష్టిని సారించాల్సి వుంది.

ఫైజర్ ప్రకటించిన  విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ వ్యాక్సిన్ ఎప్పుడో సిద్ధమైందని, అయితే, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) అధికారులతో కుమ్మక్కై, ఫైజర్ వ్యాక్సిన్ ఫలితాలను ప్రకటించలేదని ఆరోపించారు. కరోనాపై విజయం సాధించే దిశగా వ్యాక్సిన్ తయారైందని ఎన్నికలకు ముందే ప్రకటించడాన్ని డెమొక్రాట్లు ఇష్టపడలేదని ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేస్తూ , వ్యాక్సిన్ విషయాన్ని తాను ఎన్నడో ప్రజలకు తెలియజేశానని అన్నారు. అధికారిక ప్రకటనను సంస్థ కావాలనే ఆలస్యం చేసిందని అన్నారు.ఇకపోతే , అన్ని అనుమతులు పొంది డిసెంబర్ లో టీకాను మార్కెట్ లోకి  తీసుకోవడానికి సిద్ధమైంది. ఇకపోతే ,  అమెరికాలో ఇప్పటికే కోటికి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే ప్రతిరోజూ కూడా లక్షకి  పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.
Tags:    

Similar News