కొవిడ్ ఉన్నా.. విమానంలోకి ఎక్కించుకున్నారు
ప్రపంచంలో ఎక్కడైనా సరే.. తమ జాతీయులకు (అమెరికన్ సిటిజన్ షిప్) ఏదైనా ముప్పు వాటిల్లితే.. దేనికైనా రెఢీ అన్నట్లు వ్యవహరించే దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా ముందుంటుందన్న పేరుంది. అందుకే.. అమెరికన్ సిటిజన్ షిప్ ఉన్నోళ్లు.. దేశం కాని దేశంలో ఏదైనా సమస్య ఎదురైతే.. తాము అమెరికన్ సిటిజన్లమంటూ కాస్తంత గొప్పగానే చెప్పేస్తుంటారు. మరి.. అలాంటి పెద్దన్న డైమండ్ ప్రిన్సెస్ లో ఉండి పోయిన 300 మంది అమెరికన్ల గురించి పట్టించుకోకుండా వదిలేసిన వైనంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఎంత కొవిడ్ వైరస్ అనుమానం ఉంటే మాత్రం.. అలా వదిలేస్తారా? అన్నది ప్రశ్నగా మారింది. జపాన్ కు చెందిన విహార నౌక డైమండ్ ప్రిన్సెస్ చైనా చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి రావటం.. నౌకలో ఉన్న వారిలో కొందరు తీవ్రమైన జ్వరంతో బాధ పడిపోతుండటం.. కొవిడ్ వైరస్ అనుమానాలు ఉండటంతో.. ఈ నౌకలోని వారిని బయటకు వచ్చేందుకు ఏ దేశం ఒప్పుకోలేదు. కొద్ది రోజులు సముద్రం లోనే ఉండి పోయింది. ఈ నౌక లో అమెరికన్లు దాదాపు 300 మంది ఉన్నారు. ఇంతమంది నౌకలో ఉండిపోతే.. తమ వారిని రక్షించుకునే విషయంలో అగ్ర రాజ్యానికి పట్టలేదన్న విమర్శ ఉంది.
ఇలాంటివేళ.. అమెరికా రియాక్ట్ అయ్యింది. మొన్నామధ్య వుహాన్ లో ఉన్న భారతీయుల్ని రెండు ప్రత్యేక విమానాల్లో ఏ రీతిలో అయితే భారత్ కు తీసుకొచ్చారో.. ఇప్పుడు అదే తరహాలో నౌకలో ఉన్న అమెరికన్లను ప్రత్యేక విమానంలో యూఎస్ కు తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ప్రత్యేక విమానాన్ని పంపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. నౌకలో ఉన్న అమెరికన్లలో పద్నాలుగు మందికి కొవిడ్ వైరస్ పాజిటివ్ ఉంది. అయినప్పటికి వారిని సైతం విమానంలోకి అనుమతించారు.
ఇలాంటి పరిస్థితి ని ముందే అనుమానించిన అమెరికన్ అధికారులు.. విమానం లో ప్రత్యేక ఛాంబర్లు ఏర్పాటు చేశారు. అందులో వైరస్ ఉన్న వారిని ప్రత్యేకంగా ఉంచారు. వీరు మిగిలిన ప్రయాణికుల్ని కలవటానికి వీల్లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అమెరికా కు ఈ విమానం చేరుకున్నంతనే ప్రత్యేక ప్రాంతానికి తీసుకెళతారు. అక్కడ పలు పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం పద్నాలుగు రోజుల పాటు ఉంచి.. అప్పటికి వైరస్ ఆనవాళ్లు వారిలో ఏ మాత్రం కనిపించకుండా ఉన్న తర్వాత మాత్రమే బాహ్య ప్రపంచంలోకి వారిని అనుమతిస్తారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. నౌకలో చిక్కుకుపోయిన తమ దేశీయుల్ని రక్షించటానికి ఇంత టైం తీసుకుంటారా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.