వీసా ప్రాసెస్ కు బంద్ పెడుతూ అమెరికా కాన్సులేట్ నిర్ణయం
పేరుకు అగ్రరాజ్యమే కానీ.. కంటికి కనిపించని కరోనా వైరస్ ధాటికి వణికిపోతున్న ఆ దేశం.. తాజాగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులకు గురి అవుతోంది. తొలుత సీరియస్ గా తీసుకున్నా.. మధ్యలో ఒక మోస్తరుగా పట్టించుకున్న తీరుతో పాటు.. అనూహ్యంగా యూరప్ లో వైరస్ సోకటం.. ఆ విషయాన్ని గుర్తించి.. తగిన చర్యల్ని తీసుకోవటంలో దొర్లిన పొరపాటు ఆగ్రరాజ్యాన్ని కరోనాకు వణికేలా చేస్తోంది. ప్రస్తుతం ఆ దేశంలో పెద్ద ఎత్తున అనుమానిత కేసులు వెలుగు చూస్తున్నాయి. మరణించిన వారి సంఖ్య కూడా ఎక్కువే.
ఇదంతా చూసినప్పుడు కరోనాకు అగ్ర.. చిన్న దేశాల తేడా లేదన్న విషయంతో పాటు.. తనకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి చటుక్కున వచ్చి తిష్ట వేయటం కరోనాకు అలవాటే. ఈ కారణంతోనే అమెరికాలో కరోనా అనుమానిత కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటివేళ.. మాయదారి కరోనాకు చెక్ పెట్టక పోతే మొదటికే మోసం ఖాయం.
తమ దేశంలో కరోనాను నిలువరించాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పుడా దేశం నడుం బిగించింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వారిని నిలువరించటం.. వారిపై వీసా ఆంక్షలు విధించటం చేస్తున్నారు. అంతేకాదు.. అమెరికాకు ప్రయాణాలు పెట్టుకున్న వారు తమ జర్నీని పోస్టుపోన్ చేసుకోవాలన్న సూచన చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు తమ దేశంలోకి విదేశీయుల్ని అడుగు పెట్టకుండా ఉండేలా చర్యలు తీసుకోకున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని అమెరికా కాన్సులేట్ లో సోమవారం నుంచి వీసాల జారీ కార్యక్రమాన్ని నిలుప వేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇమ్మిగ్రెంట్.. నాన్ ఇమ్మింగ్రెండ్ వీసా అపాయింట్ మెంట్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి డేట్ వచ్చే వరకు వీసాల జారీ కార్యక్రమాల్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇక పై ఎలాంటి వీసా సర్వీసులు ఉండవని చెబుతున్నారు. ఈ నేపథ్యం లో వీసా అపాయింట్ మెంట్లను రీషెడ్యూల్ చేసుకోవాలన్న సూచన వినిపిస్తోంది. భారత్ లోని అన్ని అమెరికన్ కాన్సులేట్లకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేస్తున్నారు. సో.. అమెరికన్ వీసాల మీద ఆశలు పెట్టుకున్న వారికి కరోనా భారీ షాకిచ్చినట్లే.