జగన్ ను కలిసిన అమెరికా కాన్సూల్ జనరల్

Update: 2019-07-02 10:12 GMT
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అమెరికా కాన్సూల్ జనరల్ క్యాథరీన్ బి హడ్డా మంగళవారం ఉదయం కలిశారు. అమరావతిలోని సచివాలయానికి వచ్చిన క్యాథరిన్ ను సీఎం జగన్ సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఇమిగ్రేషన్, వీసా విషయాంలో చర్చలు జరిపినట్టు తెలిసింది.

ఇక వైఎస్ జగన్ ను కలిసిన తర్వాత  అమెరికా కాన్సూల్ జనరల్ క్యాథరీన్  భేటి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి కామెంట్ చేశారు. ‘ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్ కు అభినందనలు.. భవిష్యత్ లో అమెరికా, ఏపీ ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు కొనసాగాలని ఆశిస్తున్నాను’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

ఇక గతంలోనూ క్యాథరిన్ జగన్ తో కలిసిన ఫొటోను షేర్ చేసి పంచుకున్నారు. ప్రధానంగా అమెరికాకు ఎక్కువ సంఖ్యలో తెలుగు వారినుంచే దరఖాస్తులు వస్తుంటాయి. వీసా వెరిఫికేషన్ కోసం ఏపీ ప్రభుత్వం సహకారం కోసమే క్యాథరిన్ జగన్ ను కలిసినట్టు తెలుస్తోంది.


Tags:    

Similar News