మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం మృతి?

Update: 2020-06-05 11:33 GMT
1993లో ముంబైలో వరుస బాంబు పేలుళ్లు పేల్చి వందలాది మందిని చంపి మారణ హోమం సృష్టించిన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు పాకిస్తాన్ మీడియా కోడై కూస్తోంది.

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కరోనా వైరస్ సోకినట్టుగా తెలిసింది. దావూద్ ఇబ్రహీంతోపాటు అతడి భార్యకు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పాకిస్తాన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దావూద్ పర్సనల్ బాడీ గార్డులు - ఇతర వ్యక్తిగత సిబ్బంది అందరినీ క్వారంటైన్ చేశారని తెలిసింది. ఈ క్రమంలో దావూద్ కు దీర్ఘాకాలిక వ్యాధులు ఉండడం.. వృద్ధాప్యం కారణంగా కరోనా సోకడంతో మృత్యువాతపడినట్టు పాకిస్తాన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం కరాచీలోని మిలటరీ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం కరోనా చికిత్స పొందుతూ చనిపోయినట్లు చెబుతున్నారు. అయితే దీనిపై అధికారికంగా పాకిస్తాన్ కానీ.. కరాచీ వర్గాలు కానీ ధ్రువీకరించలేదు.

భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో దావూద్ ఇబ్రహీం ఉన్నాడు. ఇతడు ముంబైలో పుట్టాడు. 1993లో ముంబై వరుస బాంబు పేలుళ్ల తర్వాత దేశం విడిచి పారిపోయి పాకిస్తాన్ లోని కరాచీలో తలదాచుకుంటున్నట్టు సాక్ష్యాలున్నాయి. 2003 సంవత్సరంలో దావూద్ ఇబ్రహీంను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాయి భారత్-అమెరికా. ఇతడి తలమీద 25 మిలియన్ డాలర్ల నజరానా ఉంది. అయితే దావుద్ ఎలా చస్తాడో అని చూసిన భారత్.. చివరకు కరోనా మహమ్మారి చేతిలో దావూద్    దిక్కుమాలిన చావు చచ్చినట్టు పాకిస్తాన్ మీడియా కథనాలు చూసి దేశంలో సంబరాలు చేసుకుంటున్నారు.


Tags:    

Similar News