ఒకప్పుడు వేల కోట్లకి అధిపతి..నేడు రూ. 24 వేల కోట్ల అప్పు..ఎవరంటే!

Update: 2020-10-23 09:50 GMT
ఎప్పుడు పెద్దలు ఒక మాట చెప్తుంటారు. ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉంచుకోవాలి , మన నుండి వెళ్లిపోయిన తర్వాత దాన్ని మళ్లీ సంపాదించుకోవడం చాలా కష్టం. అది మనిషి అయిన , డబ్బు అయిన. ఏ క్షణం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. తాజాగా, దీనికి ఉదాహరణగా నిలిచిన ఘటన చోటుచేసుకుంది. ప్రపంచ కుబేరుల్లో ఒక్కరైన లక్ష్మీ మిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్ దివాళా తీశాడు. లండన్ ‌కు చెందిన ఈ వ్యాపారవేత్త వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయారు. తనకు దాదాపు రూ. 24 వేల కోట్ల అప్పులు ఉన్నట్టు లండన్ హైకోర్టు కు తెలిపారు.

2013 వ సంవత్సరంలో ప్రమోద్ మిట్టల్ తన కూతురు శ్రేష్టి వివాహం జరిపించాడు.  ఆ వివాహం కూడా సాదాసీదాగా కాదు.  వివాహానికి రూ.500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి అంగరంగ వైభవంగా జరిపించాడు. 2013లో జరిగిన ఈ పెళ్లి వేడుక గురించి జనాలు కథలు కథలుగా చెప్పుకున్నారు. అలాంటి ప్రమోద్ మిట్టల్ ఇప్పుడు దివాళా తీసి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. తనకు వ్యక్తిగత ఆదాయం లేదు.. ఆర్ధికంగా నా భార్య స్వతంత్రగా ఉంది.. ఇద్దరికీ వేర్వేరు బ్యాంకు ఖాతాలున్నాయి.. ఆమె ఆదాయం గురించి తన వద్ద స్వల్ప సమాచారం ఉంది. వ్యక్తిగత ఖర్చుల కోసం నెలకు 2000-3000 పౌండ్లు అవసరం.. రుణాలకు సంబంధించి లీగల్ ఖర్చులను మూడో పార్టీ భరిస్తోంది’అని మిట్టల్ తెలిపారు.

2006లో బోస్నియన్ కోక్ తయారీ కంపెనీ జీఐకేఐఎల్ రుణాలకు తన గ్లోబల్ స్టీల్ హోల్డింగ్ తరఫున ఆయన హామీ సంతకం పెట్టారు. అయితే జీఐకేఐఎల్ సంస్థ రుణాలను తిరిగి చెల్లించలేకపోవడంతో వ్యవహారం కోర్టుకు వెళ్లింది. రుణం ఇచ్చిన మార్గెట్ కంపెనీ 166 మిలియన్ డాలర్లను చెల్లించాలని దావా వేసింది. ఇంత మొత్తాన్ని చెల్లించలేకపోవడంతో ఆయన దివాళా తీశారు.అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలపై 2019లో ప్రమోద్ మిట్టల్‌ను బోస్నియాలో అరెస్ట్ చేశారు. అక్రమాలకు పాల్పడినట్టు 2019లో భారత్ ‌లోనూ రూ.2,200 కోట్ల వరకు మనీ లాండ్రింగ్ ‌కు పాల్పడినట్టు ప్రమోద్ మిట్టల్ ఆరోపణలు ఉన్నాయి.
Tags:    

Similar News