మొరటు శృంగారం.. లైంగిక దాడి రెండూ ఒక్కటేనా..వేర్వేరా

Update: 2020-08-27 00:30 GMT
పరస్పర అంగీకారంతో జరిగేది సెక్స్. కొందరు శృంగారంలో మితి మీరి ప్రవర్తిస్తుంటారు. శరీరంలోని ప్రైవేట్ పార్ట్స్ ను గాయపరిచేలా ఉంటుంది వీరి ప్రవర్తన. అయితే భాగస్వామికి అది ఇష్టమైతే ఆ మొరటు శృంగారం తప్పేమి కాదు. అయితే మొరటు శృంగారం పేరు చెప్పి భాగస్వామి గొంతు నులమడం, ఒళ్ళంతా కొరకడం, ప్రైవేట్ పార్ట్స్ ని గాయపరచడం లైంగిక దాడి కిందకే వస్తుంది. అయితే చాలా దేశాల్లో మహిళలు  తమ పై లైంగిక దాడి జరిగిందని.. పోలీస్ స్టేషన్లకు కోర్టులకు వెళ్ళినా న్యాయం జరగడం లేదు. దీనికి కారణం 'రఫ్ సెక్స్ డిఫెన్స్ ' చట్టమే. చాలామంది పరస్పర అంగీకారంతో సెక్స్ కు అంగీకరించినా కొంతమంది సెక్స్ మొదలయ్యాకా  తమ వికృత రూపాన్ని ప్రదర్శిస్తుంటారు. సెక్స్ పేరు చెప్పి ఒళ్లంతా గాయాలు  చేస్తుంటారు.

కొంతమంది ఇతరులతో అక్రమ  సంబంధాలు నెరుపుతూ  తమకు ఇష్టమైనప్పుడు వచ్చి , భాగస్వామికి కుదరని సమయం, ఇష్టం లేని సమయంలో  బలవంతంగా సెక్స్ చేస్తుంటారు. కొన్ని సార్లు ఎదురు తిరిగితే అత్యాచారం చేసి హతమారుస్తుంటారు. నిజానికి ఇవన్నీ లైంగిక దాడులే. ఇలాంటి సంఘటనల్లో  తమకు న్యాయం చేయాలని బాధితులు కోర్టు మెట్లెక్కినా వారికి న్యాయం జరగడం లేదు. దీనికి కారణం రఫ్ సెక్స్ డిఫెన్స్ చట్టమే. అయితే ఈ  చట్టం పేరు చెప్పి చాలా మంది పురుషులు బయట పడుతున్నారు. తాము కావాలని అలా చేయలేదని అనుకోకుండా అలా చేయాల్సి వచ్చిందని, లేకుంటే పొరపాటున చేశామనో చెప్పి తప్పించుకుంటున్నారు. ఈ చట్టం కారణంగా చాలా దేశాల్లో.. స్త్రీలు దారుణంగా లైంగిక దాడికి గురైనా.. కోర్టుల్లో న్యాయం దొరకడం లేదు. ఇలాంటి సంఘటనలపై, సామాజిక కార్యకర్తల  ఉద్యమాలతో ఇంగ్లాండ్, వేల్స్ దేశాల్లో ' రఫ్ సెక్స్ డిఫెన్స్ 'చట్టాన్ని తొలగించారు. యూకేలో 37 శాతం స్త్రీలు పరస్పర అంగీకారంతోనే సెక్స్ కు అంగీకరించినా  భాగస్వామి మాత్రం.. సెక్స్ జరిపే టప్పుడు శరీరంలోని అవయవాలను గాయపరచడం, ఉమ్మి వేయడం, గొంతు నులపడం వంటివి చేస్తున్నారు.

గత దశాబ్దకాలంలో 60  మంది స్త్రీలు శృంగార సమయంలో హత్యకు గురయ్యారు. అన్ని  కేసుల్లోనూ పురుషులు  పరస్పర అంగీకారంతోనే సెక్స్ చేశామని వాదించి తప్పించుకున్నారు.  శృంగారమంటే భాగస్వామికి నచ్చినంతవరకే కానీ.. శరీరాన్ని గాయపరచడం, చంపడం  వరకూ  కాదు. శృంగార సమయంలో భాగస్వామి హెచ్చరిస్తున్నా వినకుండా మొరటుగా,  వికృతంగా ప్రవర్తిస్తే అది నేరంగానే పరిగణించాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో లైంగిక దాడి పై చట్టాలు సవరించాల్సి ఉందని వారంటున్నారు.
Tags:    

Similar News