'టీ' తాగి మృతి చెందిన ఇద్దరు సాధువులు !

Update: 2020-11-22 15:10 GMT
ఉత్తర ప్రదేశ్‌ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన మధురలో ఇద్దరు సాధువులు అనుమానాస్పద రీతిలో అకస్మాతుగా మృత్యవాత పడ్డారు.  అలాగే , మరో సాధువులు చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడుతు, ప్రాణాలతో పోరాడుతున్నాడు. దీనికి ప్రధాన కారణం వారు నివాసం ఉంటున్న ఆశ్రమంలోనే టీ తాగుతూ కుప్పకూలిపోయారు. చనిపోయిన వారిద్దరిలో 60సంవత్సరాల వయస్సున్న గులాబ్ సింగ్ ఆశ్రమంలోనే చనిపోయాడని తెలియగా, శ్యామ్ సుందర్  ని హాస్పిటల్ కు తీసుకెళ్లగా చనిపోయాడని డాక్టర్లు డిక్లేర్ చేశారు. మూడో వ్యక్తి అయిన రాంబాబు ను స్థానిక హాస్పిటల్ లో చేర్పించి ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నారు.

వారి చావుల వెనుక కారణం తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్ అన్నారు. ఈ మేరకు ఆశ్రమం నుంచి ఆధారాలు సేకరించే పనిలో పడింది ఫోరెన్సిక్ టీం. మృతుల్లో ఒకరైన గులాబ్ సింగ్ కోసి కలాన్ పోలీస్ స్టేషన్ పరిథిలోని దౌలాతా గ్రామస్తుడు కాగా… శ్యాం సుందర్, రామ్ బాబులిద్దరూ గోవర్థన్ పోలీస్ స్టేషన్ పరిథిలోని పైన్‌తా గ్రామానికి చెందిన వారని అధికారులు తెలిపారు. బాధితుల సోదరుడు గోపాల్ దాస్ వారంతా ఆశ్రమంలోనే విషం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. జిల్లా అధికారి సర్వగ్యా రాం మిశ్రా.. కేసుపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని , ఇప్పటివరకు ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు.
Tags:    

Similar News