తెలంగాణ యువకుడి ఉసురు తీసిన బెట్టింగ్ యాప్స్.. వరుసగా రెండోది!

ఆన్ లైన్ బెట్టింగ్ ఎంత ప్రమాదమో చెప్పే అనేక సంఘటనలు ఇప్పటికే తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.;

Update: 2025-12-26 04:48 GMT

ఆన్ లైన్ బెట్టింగ్ ఎంత ప్రమాదమో చెప్పే అనేక సంఘటనలు ఇప్పటికే తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సులువుగా డబ్బులు సంపాదించేయొచ్చనే ఆలోచనతో మొదటికే మోసం తెచ్చుకోవద్దని ఎన్నో హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి. పైగా ఇటీవల బెట్టింగ్ యాప్ అను ప్రమోట్ చేసిన విషయంపై సెలబ్రెటీలపైనా పోలీసులు సీరియస్ గా స్పందించారు.

అయినప్పటికీ.. ఆన్ లైన్ వేదికగా ఈ బెట్టింట్ యాప్ ల బారినపడుతున్న వారి సంఖ్య తగ్గడం లేదు. ప్రాంతం ఏదైనా, ప్రొఫెషన్ మరేదైనా.. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది వ్యక్తులు ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంటున్నారు.. దెబ్బలు తింటూనే ఉంటున్నారు! ఈ క్రమంలో.. ఈ యాప్ ల ఎఫెక్ట్ తో 18 ఏళ్ల తెలంగాణ యువకుడు తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు.

అవును... బెట్టింగ్ యాప్ ల బారిన పడొద్దని, కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే ఆలోచనను విరమించుకోండని, బెట్టింగ్ యాప్ లలో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయని పోలీసులు నిత్యం హెచ్చరికలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ చాలా మంది వాటిని నమ్ముకుని బోర్లా పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా 18 ఏళ్ల తెలంగాణ యువకుడు ఈ బెట్టింగ్ యాప్ ల ప్రభావంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిలా కందుకూరు ప్రాంతనికి చెందిన విక్రమ్.. బెట్టింగ్ యాప్ లలో డబ్బులు పెట్టాడని చెబుతున్నారు. ఈ క్రమంలో అతడు సుమారు రూ. లక్ష వరకూ పోగుట్టుకున్నాడని అంటున్నారు. దీంతో.. చేసేదేమీ లేకో ఏమో కానీ.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.

ఈ క్రమంలో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విక్రమ్ చనిపోయాడు. దీంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ ల జోలికి వెళ్లొద్దని నొక్కి చెబుతున్నారు!

కాగా... ఇటీవల ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లతో అప్పుల ఊబిలో కూరుకుపోయి, హైదరాబాద్ లోని ఒక టాక్సీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. యాదాద్రి - భువనగిరి జిల్లాకు చెందిన పాలడుగు సాయి (24) గత రెండేళ్లుగా ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అతడు భారీ మొత్తంలో స్నేహితులు, బంధువుల వద్ద అప్పులు తీసుకున్నాడని.. బ్యాంక్స్ నుంచి పర్సనల్ లోన్స్ తీసుకున్నాడని చెబుతున్నారు.

ఈ క్రమంలో సాయి మరణించే సమయానికి సుమారు రూ.15 లక్షల అప్పుల్లో ఉన్నాడని.. డబ్బు తిరిగి చెల్లించాలంటూ స్నేహితులు, బంధువులు, బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరగడంతో అతడు పురుగులమందు తాగాడని పోలీసులు వెల్లడించారు! ఈ క్రమంలో సాయిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ క్రమంలో తాజాగా విక్రమ్ కూడా అదేపనికి పాల్పడ్డాడు.. ప్రాణాలు విడిచాడు.

Tags:    

Similar News