ఇన్ఫోసిస్ లో ఎంట్రీ జాబ్ ప్యాకేజీ రూ.21 లక్షలు.. షరతులు వర్తిస్తాయి

జాబ్ రాలేదని కొందరు.. మార్కెట్ సరిగా లేదని మరికొందరు.. ఆఫర్లు ఇస్తున్నా ప్యాకేజీలు ఆకర్షణీయంగా ఉండటం లేదని మరికొందరు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.;

Update: 2025-12-26 05:03 GMT

జాబ్ రాలేదని కొందరు.. మార్కెట్ సరిగా లేదని మరికొందరు.. ఆఫర్లు ఇస్తున్నా ప్యాకేజీలు ఆకర్షణీయంగా ఉండటం లేదని మరికొందరు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే.. టాలెంట్ ఉండాలే కానీ.. కళ్లకు అద్దుకొని మరీ జాబ్ ఇచ్చేందుకు బోలెడన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయన్న నిపుణుల మాటకు తగ్గట్లే.. తాజాగా దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిన్ సంచలన ఆఫర్ ను ప్రకటించింది. ఎంట్రీ లెవల్ జాబ్ కు దేశంలోని ఐటీ కంపెనీల్లో ఎవరూ ఆఫర్ చేయని ప్యాకేజీని ఆఫర్ చేసి వార్తల్లోకి వచ్చింది.

ఏఐ సామర్థ్యాన్ని పెంచుకోవటానికి.. డిజిటల్ నైపుణ్యం ఎక్కువగా ఉన్న వారిని ఆట్రాక్టు చేయటం కోసం ఇప్పటివరకు ఎవరూ ఆఫర్ చేయని భారీ ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఇంతకూ ఆ భారీ ప్యాకేజీ ఎంతంటే అక్షరాల రూ.21 లక్షలు. ఇతర ఐటీ కంపెనీల్లో స్పెషలైజ్డ్ రోల్స్ తో పోలిస్తే ఇదే అత్యధిక ప్యాకేజీ కావటం విశేషం. భారత ఐటీ దిగ్గజాలు గడిచిన పదేళ్లుగా ఎంట్రీ లెవల్ జీతాల్ని పెద్దగా పెంచింది లేదు. ప్రెషర్లకు వేతనం రూ.2.45 లక్షల నుంచి రూ.3.5 లక్షలు మాత్రమే ఆఫర్ చేస్తున్నారు.

అదే సమయంలో సీఈవోల సగటు వార్షిక వేతనం రూ.3.37 కోట్ల నుంచి రూ.3.37 కోట్ల వరకు ఉండేది. అది కాస్తా 835 శాతం పెరిగి మూడేళ్ల క్రితం రూ.31.5 కోట్లకు చేరింది. ఇలాంటి వేళ.. ఎంట్రీ లెవల్ జాబ్ కోసం ఆకర్షణీయమైన ప్యాకేజీని ప్రకటించటం ద్వారా ఇన్ఫోసిస్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఇదిలా ఉంటే ప్రత్యేక నైపుణ్యం ఉన్న ప్రెషర్లకు డిజిటల్.. ప్రైమ్ ఎలైట్ కింద రూ.7 నుంచి రూ.11 లక్షల చొప్పున వార్షిక ప్యాకేజీని టీసీఎస్ అందిస్తుంటే.. విప్రో సైతం రూ.6.5 లక్షలు ఆఫర్ చేస్తోంది. వీరికి భిన్నంగా దాదాపు రెండు నుంచి మూడు రెట్లు ప్యాకేజీ ఆఫర్ చేయటం ద్వారా కొత్త ట్రెండ్ కు ఇన్ఫోసిస్ తెర తీసినట్లు చెప్పాలి.

Tags:    

Similar News