అమెరికాలో లోపల కూడా ఇమిగ్రేషన్ తనిఖీలు.. ప్రయాణికులకు హైఅలెర్ట్

అమెరికా దేశంలో ఒక నగరం నుంచి మరో నగరానికి ప్రయాణించేటప్పుడు కేవలం డ్రైవింగ్ లైసెన్స్ లేదా రియల్ ఐడీ ఉంటే సరిపోతుందని చాలా మంది భావిస్తారు.;

Update: 2025-12-26 04:53 GMT

అమెరికా దేశంలో ఒక నగరం నుంచి మరో నగరానికి ప్రయాణించేటప్పుడు కేవలం డ్రైవింగ్ లైసెన్స్ లేదా రియల్ ఐడీ ఉంటే సరిపోతుందని చాలా మంది భావిస్తారు. అంతర్జాతీయ ప్రయాణాల్లో ఉండే ఇమిగ్రేషన్ తనిఖీలు ఇక్కడ ఉండవేని అందరి నమ్మకం.. కానీ తాజాగా డల్లాస్ ఫోర్ట్ వర్త్ (డీఎఫ్.డబ్ల్యూ) విమానాశ్రయంలో జరిగిన ఘటన ఈ అంచనాలను తలకిందులు చేసింది.

డీఎఫ్.డబ్ల్యూ ఎయిర్ పోర్టులో ఏం జరిగింది?

ఇటీవల డీఎఫ్.డబ్ల్యూ ఎయిర్ పోర్టులో టెర్మినల్ డీ వద్ద సెక్యూరిటీ చెక్ జరుగుతున్న సమయంలో ‘యూఎస్.సీ.ఐ.ఎస్ అధికారల సెక్యూరిటీ డాగ్స్ తో కలిసి ప్రయాణికులను రాండమ్ గా తనిఖీ చేయడం ప్రాంభించాు. అక్కడ ఉన్న ఒక హెచ్1బీ వీసా హోల్డర్ ను అధికారులు ఆపి అతడి వీసా స్టేటస్ గురించి ప్రశ్నించా. అధికారుల సిస్టమ్ లో అతడి స్టేటస్ ఇంకా ‘ఎఫ్1 స్టూడెంట్’గానే చూపిస్తోంది.కానీ సదురు ప్రయాణికుడు గత ఏడాదే తన స్టేటస్ హెచ్1బీకి మారిందని వివరించాడు. అదృష్టవశాత్తు ఆ ప్రయాణికుడి వద్ద పాస్ పోర్టు లేకపోయినప్పటికీ తన మొబైల్ లో ఐ-797ఏ అప్రూవ్ నోటీస్ సాఫ్ట్ కాపీ సిద్ధంగా ఉంది. దానిని చూపించడంతో అధికారులు వెరిఫై చేసి అతడిని ప్రయాణానికి అనుమతించారు.

ఈ ఘటన మనకు నేర్పుతున్న పాఠాలేంటి?

అమెరిరకాలో నివసిస్తున్న నాన్ ఇమిగ్రెంట్స్ (హెచ్1బీ, ఎఫ్1, ఓపీటీ, స్టెమ్ ఓపీటీ హోలర్డు) తప్పక కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ రికార్డుల్లో ఐ94 లేదా యూఎస్.సీ.ఐఎస్ డేటా బేస్ మీ స్టేటస్ అప్ డేట్ కావడానికి సమయం పట్టవచ్చు. లేదా సాంకేతిక లోపాలు ఉండవచ్చు. కేవలం సరిహద్దుల్లోనే కాకుండా దేశీయ విమానాశ్రయాల్లో కూడా ఎప్పుడైనా ఇమిగ్ేషన్ అధికారులు తనిఖీలు చేపట్టే అధికారం కలిగిఉంటారు. ఫిజికల్ కాపీలు లేకపోయినా.. కనీసం మీ ఫోన్ లో లేదా క్లౌడ్ స్టోరేజ్ లో మఖ్యమైన పత్రాల స్కాన్డ్ కాపీలు ఉండడం ప్రాణపదం.

ప్రయాణ సమయంలో మీ వెంట ఉండాల్సిన కీలక పత్రాలు ఇవీ..

అమెరికాలో దేశీయ ప్రయాణం చేస్తున్నా సరే కొన్ని కీలక పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఐ-797 అప్రూవ్ నోటీస్ మీ ప్రస్తుత వీసా స్టేటస్ కు ప్రధాన ఆధారం. ఐ94 కాపీ మీ లేటెస్ట్ అరైవల్, డిపార్చర్ రికార్డుగా ఉపయోగపడుతుంది. బయో పేజీ , వీసా స్టాంపింగ్ ఉన్న పేజీల సాఫ్ట్ కాపీలు , మీరు ఓపీటీ లేదా స్టెమ్ ఓపీటీ లో ఉంటే ఇది తప్పనిసరి.

దేశీయ ప్రయాణమే కదా ఎవరూ అడగరు అనే నిర్లక్ష్యం వద్దు.. చిన్న డాక్యుమెంట్ లేకపోవడం వల్ల అనవసరమైన ఆలస్యం, ఒత్తిడి లేదా విచారణ ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ మీ ఇమిగ్రేషన్ పత్రాలను అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News