మేనేజర్ కు లిఫ్ట్ ఇచ్చి కారులో రేప్ చేసిన సీఈఓ!
ఐటీ మేనేజర్ గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిపై ఆ కంపెనీ సహోద్యోగి భర్త, ఆ కంపెనీ సీఈఓ సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది.;
ఐటీ మేనేజర్ గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిపై ఆ కంపెనీ సహోద్యోగి భర్త, ఆ కంపెనీ సీఈఓ సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది. అర్ధరాత్రి వేడుక తర్వాత లిఫ్ట్ ఇస్తామని చెప్పి, కదులుతున్న కారులోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై బాధితురాలు మరుసటి రోజు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అవును... రాజస్థాన్ లోని ఉదయపూర్ లో నూతన సంవత్సర పార్టీకి హాజరైన తర్వాత.. ఇంటికి లిఫ్ట్ ఇస్తానని చెప్పి.. ఓ ప్రైవేటు ఐటీ కంపెనీ మేనేజర్ పై కదుతులున్న కారులో సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమయంలో.. అత్యాచారం అనంతరం స్పృహలోకి వచ్చిన తర్వాత బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... డిసెంబర్ 20న ఒక ప్రైవేటు హోటల్ లో ఓ ఐటీ కంపెనీకి సంబంధించిన పార్టీ జరిగింది. ఆ పార్టీకి బాధితురాలు రాత్రి 9 గంటల ప్రాంతంలో హాజరైంది. ఆ పార్టీ తెల్లవారుజామున 1:30 గంటల వరకూ కొనసాగింది. ఈ క్రమంలో అతిథులంతా ఎవరికి వారు వారి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ సమయంలో ఆ మహిళ ఒక్కరే అక్కడ ఉండిపోయారు.
ఈ సమయంలో.. ఆ కంపెనీ సీఈఓ, ఒక మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్, ఆమె భర్త.. ఆమెను ఇంటివద్ద దింపడానికి ముందుకు వచ్చారని ఆమె ఆరోపించింది. ఈ సమయంలో ఆ కారులో తన మహిళా సహోద్యోగి కూడా ఉండటంతో ధైర్యంగా కారు ఎక్కినట్లు చెబుతున్నారు! మార్గమధ్యలో ఒక దుకాణం నుంచి దూమపానం చేసే సామాగ్రిని కొని తనకు ఇచ్చారని.. తర్వాత తాను స్పృహ కోల్పోయిందని ఆరోపించారు.
ఉదయం 5 గంటల ప్రాంతంలో తనను ఇంట్లో దింపారని.. పూర్తిగా స్పృహలోకి వచ్చేసరికి.. చెవి పోగులు, సాక్స్, లోదుస్తులు కనిపించలేదని, తన ప్రైవేటు భాగాలపై గాయలు ఉన్నాయని గమనించి.. తనను సీఈఓ లైంగికంగా వేధిస్తున్నాడని.. ఆ తర్వాత ముగ్గురు నిందితులూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఈ ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేయబడింది.
ఈ సమయంలో.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు.. వైద్య పరీక్షల తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన ఉదయపూర్ ఎస్పీ యోగేష్ గోయల్... సామూహిక అత్యాచారానికి ప్రాథమిక ఆధారలను గుర్తించినట్లు తెలిపారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరుస్తున్నామని అన్నారు.