25 లక్షల కోసం చంపేశారు!
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సహా.. హైకోర్టులో న్యాయవాదిగా మొహిజుద్దీన్ పనిచేస్తున్నారు. రెడ్‌హిల్స్ శాంతినగర్‌లోని మోయిజ్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు.
25 లక్షల రూపాయల కోసం.. న్యాయవాదిని దారుణంగా కారుతో గుద్దించి చంపేసినట్టు పోలీసులు తెలిపా రు. ఇటీవల హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపిన న్యాయవాది హత్య కేసును విచారించిన పోలీసులు.. తాజాగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. 25 లక్షల రూపాయల కోసం అతనిని హత్య చేసినట్టు తెలుసుకున్నారు.
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సహా.. హైకోర్టులో న్యాయవాదిగా మొహిజుద్దీన్ పనిచేస్తున్నారు. రెడ్‌హిల్స్ శాంతినగర్‌లోని మోయిజ్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. ఒకవైపు న్యాయవాదిగా ఉంటూనే మరో వైపు.. హైదరాబాద్ వక్ఫ్ బోర్డు ప్యానల్ న్యావాదిగా కూడా ఖాజా పనిచేస్తున్నారు. అయితే.. వక్ఫ్ భూముల పరిరక్షణలో భాగంగా ఆక్రమిత స్థలాలపై ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇదే.. ఆయన హత్యకు దారి తీసినట్టు పోలీసులు గుర్తించారు.
ఓ కాలేజీ.. వక్ఫ్ భూములను ఆక్రమించుకుంది. దీనిపై వక్ఫ్ బోర్డు కోర్టులో కేసు వేసింది. ఈ కేసును ఖాజా వాదిస్తున్నారు. దీనిపై కక్ష పెంచుకున్న కాలేజీ యాజమాన్యం.. సుపారీ ఇచ్చి.. ఖాజాను హత మార్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఘటనకు పాల్పడిన మహబూబ్ ఆలంఖాన్, ఆయన కొడుకును అరెస్టు చేశారు. భూ వివాదం నేపథ్యంలోనే తాము సుపారీ తీసుకుని హత్య చేసినట్టు వివరించారు.
గతంలో 10 సార్లు..
హత్యకు గురైన ఖాజాపై గతంలో పది సార్లు హత్యాయత్నం చేసినట్టు నిందితులు తెలిపారు. భూ వివాదం కోర్టుకు చేరిన నాటి నుంచే ఖాజాను హత్య చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు వివరించారు. కాగా.. ఈ నెల 23(శనివారం)న న్యాయవాది ఇంటి నుంచి బయటకు వచ్చి కారు ఎక్కుతుండగా.. దూసుకు వచ్చిన వాహనం.. ఆయనను ఢీ కొట్టి.. 30 మీటర్ల మేరకు లాక్కుపోయింది. తొలుత దీనిని ప్రమాదమని అనుకున్నా.. తర్వాత పోలీసులు హత్యగా నిర్ధారించారు.