#ViralNews - ఆఫీస్ లోనే ప్రేయసిని దారుణంగా హత్య చేసిన ప్రియుడు.. కట్ చేస్తే ?

ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణ హత్యల జాబితాలోకి మరో అమాయక అమ్మాయి చేరిపోయింది. కలిసి బతకాల్సిన వాడే కాలయముడిగా మారి ప్రాణాలు తీశాడు.

Update: 2026-06-05 09:20 GMT

ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణ హత్యల జాబితాలోకి మరో అమాయక అమ్మాయి చేరిపోయింది. కలిసి బతకాల్సిన వాడే కాలయముడిగా మారి ప్రాణాలు తీశాడు. పంజాబ్‌లోని మొహాలీలో జరిగిన ఈ ఘోర విషాదానికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడవడం ఖాయం. అసలు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిపై ఆఫీస్ లోనే అంత ఘాతుకానికి ఒడిగట్టడానికి గల కారణం ఏంటి? చివరకు ఏమైంది? ఆ వివరాలు చూద్దాం..

మూడేళ్ల ప్రేమ.. ఆఫీస్‌లోనే క్లైమాక్స్:

పంజాబ్‌లోని మొహాలీలో ఉన్న ఒకే కంపెనీలో డింపుల్ (30) అనే యువతి, హర్జిందర్ సింగ్ (39) అనే వ్యక్తి కలిసి పని చేసేవారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గత మూడేళ్లుగా వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. అయితే, ఏమైందో ఏమో కానీ ఇటీవల వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక ఈ విషయాన్ని హర్జిందర్ సింగ్ తట్టుకోలేకపోయాడు. ఆమెపై విపరీతమైన కక్ష పెంచుకున్నాడు.

ఆఫీస్ సహోద్యోగుల ముందే ఘోరం:

రోజూలాగే డింపుల్ ఆఫీస్‌కు వచ్చి తన పనిలో నిమగ్నమైంది. సరిగ్గా అదే సమయంలో హర్జిందర్ సింగ్ కత్తితో ఆఫీస్‌లోకి దూసుకొచ్చాడు. డింపుల్‌ను టార్గెట్ చేస్తూ విచక్షణారహితంగా దాడి చేయడం ప్రారంభించాడు. ఇక భయంతో ఆమె ఆఫీస్ అంతా పరుగులు తీసినా వదలకుండా వెంటాడి మరీ పొడిచాడు. పక్కనే ఉన్న తోటి కొలీగ్స్ భయంతో వణికిపోతూనే, అతడిని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, సైకోలా మారిన హర్జిందర్ చేతిలో ఉన్న కత్తితో అందరినీ బెదిరిస్తూ డింపుల్‌ను కాపాడకుండా అడ్డుకున్నాడు.

కట్ చేస్తే.. నిందితుడి పరిస్థితి ఏంటి?:

కళ్లెదుటే ప్రేయసి రక్తపు మడుగులో పడిపోవడాన్ని చూసిన తర్వాత హర్జిందర్ కథ ఇంకో మలుపు తిరిగింది. క్షణికావేశంలో అంత పెద్ద తప్పు చేశానని రియలైజ్ అయ్యాడో ఏమో కానీ, వెంటనే ఆ కత్తితోనే తనను తాను పొడుచుకున్నాడు. ఇక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా, డింపుల్ అప్పటికే మరణించింది. హర్జిందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రేమ పేరుతో దారుణ హత్యలు.. మార్పు వచ్చేదెన్నడు?:

ప్రేమించిన అమ్మాయిని "నువ్వు నా దానివి కాకపోతే ఇంకెవరికీ దక్కనివ్వను" అనే మాటలతో హింసించటం. ఇది వికృతమైన సైకో మనస్తత్వానికి ఈ ఘటన మరో నిదర్శనం. ప్రేమించినప్పుడు లేని అభ్యంతరాలు, వద్దని దూరంగా వెళ్తుంటే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? ప్రేమ అనే పవిత్రమైన పదానికి అర్థాన్ని మార్చేస్తూ, నమ్మిన వాళ్లనే నడిరోడ్డుపై, ఆఫీసుల్లో దారుణంగా చంపేస్తున్న రోజులివి. సమాజంలో చట్టాలు ఎన్ని వచ్చినా, ఇలాంటి ఉన్మాదుల ఆలోచనల్లో మార్పు రానంతవరకు అమ్మాయిల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. ఇక ఇలాంటి ఘోరాలకు ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో, మన సమాజంలో అసలైన మార్పు ఎప్పుడు వస్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.



Tags:    

Similar News