కరోనా సోకిన మహిళను వదల్లేదు.. అరెస్ట్
ప్రాణాలు తీసే కరోనా సోకిందని తెలిసినా ఆ మహిళపై కామవాంఛను వ్యక్తం చేశారు ఇద్దరు కక్కుర్తి ఆస్పత్రి సిబ్బంది. తమతో కలిసి పడుకోవాలని లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చి 20 ఏళ్ల మహిళకు ఈ లైంగిక వేధింపులు ఎదురయ్యాయి.
ఢిల్లీకి శివారున ఉన్న గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ సోకిన ఓ మహిళ చికిత్స పొందుతోంది. ఆ మహిళ అసహాయతను ఆసరాగా చేసుకున్న పారిశుధ్య కార్మికుడు, స్టోర్ ఉద్యోగి లైంగికంగా వేధించారు. తమకు సుఖం అందించకపోతే నీకు కరోనా తగ్గకుండా చేస్తామని బెదిరించారు.
అయితే ఆ కరోనా మహిళ దైర్యం చేసి ఆస్పత్రి నిర్వాహకులకు తెలిపింది. దీనిపై సీరియస్ అయిన నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులు లవ్ కుశ్, ప్రవీణ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఓ ఏజెన్సీ ద్వారా చేరిన వీరిని ఆస్పత్రి నుంచి తొలగించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని ఆస్పత్రి తెలిపింది.