టెకీ శ్వేత ఆత్మహత్య కేసులో ట్విస్ట్

Update: 2020-10-14 07:00 GMT
హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శ్వేత ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. ప్రియుడు అజయ్ వేధింపులతో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నట్టు తెలిసింది.

శ్వేత కుటుంబ సభ్యులు తాజాగా అజయ్ పై ఆరోపణలు గుప్పించారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. శ్వేత మాట్లాడిన ఆడియో టేపులు బయటకు వచ్చాయి. చనిపోయే ముందు మాట్లాడిన కాల్ కావడంతో దీనిపై పోలీసులు విచారిస్తున్నారు.  ప్రాథమిక విచారణలో అజయ్ వల్లే శ్వేత ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

శ్వేత ఆత్మహత్యకు ముందు చివరగా ఇద్దరితో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. అందులో ఒకరు అజయ్ తల్లి కాగా.. మరొకరు అజయ్ సోదరి. ఈ ఇద్దరితో తన ఫొటోలను అజయ్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారని.. వాటిని తీయడం లేదని శ్వేత వాపోయింది. ఇదే విషయంపై వారిద్దరితో శ్వేత ఆవేదన వ్యక్తం చేసింది. అయినా వారు వినిపించుకోలేదు. దీంతో శ్వేత తీవ్ర మనోవేదనకు గురైంది. తల్లిదండ్రులకు చెప్పుకోలేక.. తనలో తాను కుమిలిపోయింది. ఏం చేయాలో పాలుపోక చివరకు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.అజయ్ వేధింపుల వల్లే చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

తాజాగా ప్రేమించినట్టు నటించి శ్వేతను అజయ్ మోసం చేశాడని.. బ్లాక్ మెయిల్ చేయడంతోనే ఆత్మహత్య చేసుకుందని పాల్పడిందని శ్వేత కుటుంబ సభ్యులు తెలిపారు. పర్సనల్ ఫొటోలు షేర్ చేయడంతో తీవ్ర ఒత్తిడికి గురైందని వారు చెబుతున్నారు. ఈకేసులో పోలీసులు అజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే శ్వేత తల్లిదండ్రుల ఆరోపణలపై పోలీసులు స్పందించలేదు.
Tags:    

Similar News