మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. సీఎంగా ఏక్ నాథ్ షిండే

Update: 2022-06-30 11:33 GMT
మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి.  మహారాష్ట్ర సీఎంగా ప్రమాణం ఎవరు చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్ర సీఎంగా అందరూ అనుకున్నట్టు దేవేంద్ర ఫడ్నవీస్ అవ్వడం లేదు. కొత్త సీఎంగా ఏక్ నాథ్ షిండే కానున్నారు.

మహారాష్ట్ర కొత్త సీఎంగా ఏక్ నాథ్ షిండే ప్రమాణం చేస్తారని బీజేపీ నేత ఫడ్నవీస్ ప్రకటించారు. శివసేన ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదన్నారు. హిందుత్వను, సావర్కర్ ను ప్రతిరోజు అవమానించారని..  దావూద్ తో సంబంధాలున్న నవాబ్ మాలిక్ కు మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు

జూన్ 30న ఈరోజు గవర్నర్ ను ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ లు కలిశారు. అనంతరం ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. తొలుత సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా షిండే ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది.

కానీ అనూహ్యంగా షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని చెప్పడం సంచలనమైంది. 2019లో బీజేపీ, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఉద్దవ్ ఠాక్రే ప్లేటు ఫిరాయించి కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ప్రజా తీర్పునకు విరుద్ధంగా శివసేన లాలూచీ పడడంతో ఇప్పుడు ఆ పార్టీలో చీలిక ఏర్పడి శివసేన ప్రభుత్వం కుప్పకూలింది. శివసేనను చీల్చిన ఏక్ నాథ్ షిండేనే కొత్త ముఖ్యమంత్రిగా సీఎం కుర్చీలో కూర్చోనున్నారు.
Tags:    

Similar News