• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మోడిలో ట్యూస్ డే టెన్షన్

మోడిలో ట్యూస్ డే టెన్షన్

By - Tupaki Desk
Update: 2021-08-06 04:56 GMT
ప్రధానమంత్రిలో మంగళవారం (ట్యూస్ డే) టెన్షన్ మొదలైనట్లే ఉంది. ఎందుకంటే పెగాసస్ స్పైవేర్ పై విచారణ మొదలుపెట్టిన సుప్రింకోర్టు విచారణను మంగళవారానికి వాయిదావేసింది. మంగళవారం జరిగే విచారణలో కేంద్రప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు హాజరుకావాలని ఆదేశించింది. కేంద్రప్రభుత్వానికి సంబందించిన ప్రతినిధులంటే ఐటి, హోంశాఖ ఉన్నతాధికారులని సమాచారం. కేంద్రం ప్రతినిధులు హాజరుకావాలని ఆదేశించిందంటే పెగాసస్ స్పైవేర్ పై దాఖలైన పిటీషన్లన్నీ విచారణార్హమైనవే అని సుప్రింకోర్టు నిర్ధారించినట్లే. పైగా మీడియా వచ్చిన వార్తలు నిజమే అయితే పెగాసస్ స్పైవేర్ అంశం చాలా తీవ్రమైనదే అని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించటం గమనార్హం.

ఇక్కడే నరేంద్రమోడి, అమిత్ షా లో టెన్షన్ మొదలవుతోంది. ఎందుకంటే పెగాసస్ స్పైవేర్ పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి విచారణ ప్రయత్నాన్ని బీజేపీ ఎంపిలు అడ్డుకున్న విషయం తెలిసిందే. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి కూడా సంబంధిత ఉన్నతాధికారులందరినీ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. విచారణ మొదలైతే కేంద్రం బండారం ఎక్కడ బయటపడుతుందో అన్న ఉద్దేశ్యంతో అసలు సమావేశాన్ని జరగనీయకుండా బీజేపీ ఎంపిలు అడ్డుపడ్డారు.

అప్పుడే స్పైవేర్ ను ఉపయోగించి దేశంలోని ప్రతిపక్ష నేతలు, వారి పీఎస్+పీఏలతో పాటు చాలామంది ప్రముఖుల మొబైళ్ళను కేంద్రం ట్యాపింగ్ చేసిందనే అనుమానాలు పెరిగిపోయాయి. విచిత్రమేమిటంటే ట్యాప్ అయిన మొబైళ్ళల్లో సుప్రింకోర్టు జడ్జీలు, సుప్రింకోర్టు రిజిస్ట్రార్లు, మాజీ జస్టిస్ లాంటి అనేకమందున్నారు. ప్రతిపక్షాల సమావేశాలకు సమాధానం చెప్పుకోలేకే పార్లమెంటులో ఫోన్ ట్యాపింగ్ అంశంపై చర్చకు కానీ సమాధానం చెప్పటానికి కానీ మోడి నిరాకరిస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే మంగళవారం నుండి మొదలయ్యే సుప్రింకోర్టు విచారణలో కేంద్ర ప్రతినిధులు ఏమని సమాధానం చెబుతారో చూడాలి. పెగాసస్ స్పైవేర్ తో ట్యాపింగ్ జరుగుతోందని చెబుతారా ? లేకపోతే ఇది దేశభద్రతకు సంబంధించిన అంశం కాబట్టి న్యాయస్ధానంలో విచారణ జరిపేందుకు లేదని అడ్డంగా వాదిస్తారో చూడాలి. ఏదేమైనా కరోనా వైరస్ సమస్యను డీల్ చేయటంలో దారుణంగా ఫెయిలైన మోడి ఇపుడు పెగాసస్ సాఫ్ట్ వేర్ అంశంలో ఆరోపణలు ఎదుర్కోవటం గమనార్హం.




Tags:    
  • Modi 
  • Prime Minister of india 
  • BJP 
  • Latestnews 

Similar News

భక్తి మాటున కనిపిస్తున్న పర్యావరణ విషాదం.. యమునా నదిలో ఏంటీ భయానక పరిస్థితి?

2026-11-16 13:30 GMT

దంపతుల మధ్య చిచ్చు పెట్టిన ChatGPT.. విడాకుల వరకు వెళ్లిన గొడవ!

2026-11-16 12:30 GMT

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ‘కిడ్నీ’ సేఫ్‌గా ఉందో లేదో చూసుకోండి.. సామాన్యుడికి మరో ‘డిజిటల్’ షాక్

2026-11-16 11:30 GMT

భారీ చిట్టాతో ఢిల్లీకి చంద్రబాబు.. కేంద్ర మంత్రివర్గంపై చర్చ, వేమిరెడ్డికి చాన్స్?

2026-11-16 10:24 GMT

భార‌త ఐటీ- ఫార్మా వెన‌క‌బాటును నిల‌దీసిన రిజ‌ర్వ్ బ్యాంక్ మాజీ గ‌వ‌ర్న‌ర్ రంగ‌రాజ‌న్

2026-11-16 08:21 GMT

పుస్తకాలతో కుస్తీ లేదు.. ఏఐతో మస్తి.. టాపర్‌గా మారిన చీటర్ కథ

2026-11-16 08:11 GMT

ఇంట్లో తినడానికి గుప్పెడు పిండి లేదు.. కానీ భారత్‌ను కొట్టడానికి టర్కీ నుంచి ఏకంగా లక్ష డ్రోన్లట..

2026-11-16 07:57 GMT

నెమ్మదిగా కదులుతున్న తీవ్ర వాయుగుండం.. తీరానికి భారీ ముప్పు

2026-11-16 07:56 GMT

విమానాలు ఎగరలేదు.. తప్పంతా బైడెన్ దే.. నాది కాదు.. ట్రంప్ మళ్లీ ఏసాడు..

2026-11-16 06:55 GMT

విజయసాయిరెడ్డి ఎక్కడ? పార్టీ ప్రకటన తర్వాత కనిపించని పీఆర్పీ అధినేత

2026-11-16 06:51 GMT

ఎన్ని ఎఫైర్లు పెట్టుకున్నా మళ్లీ జెన్సన్ రావాలి.. ఎన్వీడియో పగ్గాలి చేపట్టాలట.. వైట్ హౌస్ వద్దకు పంచాయితీ..

2026-11-16 04:53 GMT

భారత ఐటీ కంపెనీలకు అమెరికాలో కొత్త చిక్కులు.. H-1B వీసాలపై పెరుగుతున్న ఆంక్షలు!

2026-11-16 04:28 GMT

Copyright @2026

Powered by Blink CMS