• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  USA >  ఎన్ని ఎఫైర్లు...

ఎన్ని ఎఫైర్లు పెట్టుకున్నా మళ్లీ జెన్సన్ రావాలి.. ఎన్వీడియో పగ్గాలి చేపట్టాలట.. వైట్ హౌస్ వద్దకు పంచాయితీ..

| ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్‌ను తిరిగి ఆ పదవిలోకి తీసుకురావాలని ఎలాన్ మస్క్, ఎపిక్ గేమ్స్ సీఈఓ టిమ్ స్వీనీ సహా పలువురు టెక్ దిగ్గజాలు ప్రయత్నిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పేర్కొంది. ఈ విషయంలో వైట్‌హౌస్ మద్దతు కూడగట్టాలని చూస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఆర్మ్ సీఈఓ రెనే హాస్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

By - A.N.Kumar
Update: 2026-11-16 04:53 GMT

ఈరోజుల్లో వెరీ కామనబ్బా.. ఎఫైర్లు పెట్టుకోవడం.. ఎంజాయ్ చేయడం.. ఎవరి ఇష్టం వారిది.. ఎవరి దుకాణం వారిది.. అంతమాత్రానికే ఆ టాలెంటెడ్ ‘రోమాటింక్’ కిడ్ ను పక్కనపెడుతారా? మేం ఒప్పుకో అంటూ సిలికాన్ వ్యాలీలోని దిగ్గజ కంపెనీల సీఈవోలు, బాధ్యులు ఇప్పుడు ఎన్వీడియో సీఈవో జెన్సాన్ హువాంగ్ కోసం రంగంలోకి దిగి వైట్ హౌస్ వద్ద పంచాయితీ పెడుతున్నారట.. ట్రంప్ సారూ.. మీరు ఎలాగైనా మీరు ఎలాగైనా కొంచెం లాబీయింగ్ చేసి వినని వారి తొడపాశం పెట్టైనా ఒప్పించి మెప్పించి మళ్లీ జెన్సాన్ నే ఎన్వీడియోకు సీఈవోను చేయాలని ఒత్తిన ఒత్తుడు ఒత్తకుండా ఒత్తిడి చేస్తున్నారట..

టెక్నాలజీ ప్రపంచంలో సీఈఓల కుర్చీలు చూస్తుంటే అచ్చం మన చిన్నప్పటి 'మ్యూజికల్ ఛైర్స్' ఆట గుర్తుకువస్తుంది. మ్యూజిక్ ఆగినప్పుడు ఎవరు కుర్చీలో ఉంటారో.. ఎవరు అవుట్ అవుతారో ఎవరికీ తెలియదు. కానీ ఒకసారి ఆటలోంచి అవుట్ అయి బయటకు వెళ్లిన వ్యక్తిని మళ్లీ తీసుకొచ్చి అదే సింహాసనంపై కూర్చోబెట్టడానికి ఊరంతా ఏకమైతే? అదీ మామూలు జనం కాదు.. సాక్షాత్తూ సిలికాన్ వ్యాలీ దిగ్గజాలే రంగంలోకి దిగితే? ఇప్పుడు ఎన్విడియా మాజీ బాస్ జెన్సన్ హువాంగ్ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. సాధారణంగా ఒక కంప్యూటర్ హ్యాంగ్ అయితే 'రీ-స్టార్ట్' బటన్ నొక్కుతాం.. కానీ ఇక్కడ ఏకంగా ఒక మాజీ సీఈఓ కెరీర్‌నే రీ-స్టార్ట్ చేయడానికి టెక్ పెద్దలు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది.

ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం.. జెన్సన్‌ను మళ్లీ ఎన్విడియా పగ్గాలు చేపట్టేలా చేయడానికి టెస్లా బాస్ ఎలాన్ మస్క్, ఎపిక్ గేమ్స్ సీఈఓ టిమ్ స్వీనీ వంటి హేమాహేమీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. వీరికి తోడు కొందరు బడా ఇన్వెస్టర్లు కూడా బోర్డుపై ఒత్తిడి తెస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఒక ఉద్యోగికి లేదా సీఈఓకి మళ్లీ ఛాన్స్ రావాలంటే వాళ్లు తమ టాలెంట్ నిరూపించుకోవాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. జెన్సన్ కోసం పక్క కంపెనీల బాస్‌లు ప్రచారం చేయడం చూస్తుంటే కార్పొరేట్ ప్రపంచంలో 'స్నేహం' అంటే ఇదేనేమో అనిపిస్తోంది. "మా వాడికి మళ్లీ ఆ కుర్చీ ఇచ్చేయండి బాసూ.. కంపెనీ భవిష్యత్తుకు అదే మంచిది" అంటూ వీళ్లంతా బోర్డు సభ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట.

ఇంతమంది పెద్దలు సిఫార్సు చేస్తుంటే ఎన్విడియా బోర్డు వెంటనే "సరే" అనేస్తుందనుకుంటే పొరపాటే. బోర్డు పెద్దల మనసులో ఏముందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకవైపు జెన్సన్ రీ-ఎంట్రీ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు బిల్డప్ ఇస్తూనే మరోవైపు ప్రత్యామ్నాయంగా ఆర్మ్ సీఈఓ రెనే హాస్ పేరును కూడా తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. అంటే పాత లెదర్ జాకెట్ జెన్సన్ మార్క్ స్టైల్ కావాలా... లేక కొత్త ముఖానికి పట్టం కట్టాలా అనే డైలమాలో బోర్డు పడిపోయింది.

ఈ కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. జెన్సన్ రీ-ఎంట్రీ కోసం ఏకంగా అమెరికా అధికార కేంద్రం 'వైట్‌హౌస్' మద్దతు కూడా కూడగట్టాలని ఈ టెక్ దిగ్గజాలు భావిస్తున్నారట. ఒక ప్రైవేట్ కంపెనీ సీఈఓ నియామకానికి వైట్‌హౌస్‌కు ఏం సంబంధం అని సామాన్యులకు డౌట్ రావచ్చు. కానీ ఎన్విడియా అనేది కేవలం ఒక కంపెనీ కాదు.. అది అమెరికా చిప్ పరిశ్రమకు గుండెకాయ లాంటిదని.. జెన్సన్ వస్తేనే దేశానికి మంచిదని వీళ్లు అగ్రరాజ్యాధినేతలకు నూరిపోయాలని చూస్తున్నారట.

ఒక కుర్చీ కోసం బోర్డు రూమ్ నుంచి వైట్‌హౌస్ దాకా సాగుతున్న ఈ హై-డ్రామా టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. చివరకు ఎన్విడియా బోర్డు ఈ బయటి ఒత్తిళ్లకు తలొగ్గి జెన్సన్‌కు రెడ్ కార్పెట్ వేస్తుందా? లేక "మా కంపెనీ సంగతి మాకు తెలుసు" అని కొత్త నాయకుడిని ఎంచుకుంటుందా? అనేది వేచి చూడాలి.

Tags:    
  • jensenhuang 
  • nvidia 
  • elonmusk 
  • timsweeney 
  • siliconvalley 
  • nvidiaceo 

Similar News

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ది ఆత్మహత్యా కాదా.? పక్కా ప్లాన్‌తో చేసిన హత్యా? ఫోరెన్సిక్ విశ్లేషణతో సంచలనం

2026-11-17 12:46 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రంప్ తెచ్చిన కొత్త రూల్‌ను కొట్టేసిన కోర్టు!

2026-11-17 10:20 GMT

1.8 లక్షల మంది కోరుతున్నా.. జెన్సన్ హువాంగ్‌ను వెనక్కి తీసుకోని ఎన్విడియా!

2026-11-17 10:01 GMT

అమెరికాలో ఇరాన్ దాడికి ప్లాన్ చేస్తోందా? ట్రంప్ అధికారులకు భద్రత పెంపు!

2026-11-17 05:35 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గింది.. మాస్టర్స్ చదువుపైనే ఎక్కువ ప్రభావం!

2026-11-17 04:38 GMT

అమెరికా విమానాల రద్దు వెనుక అసలు విలన్ ఎవరు? ఆ 4 సెకన్ల కథేంటి?

2026-11-16 18:55 GMT

విమానాలు ఎగరలేదు.. తప్పంతా బైడెన్ దే.. నాది కాదు.. ట్రంప్ మళ్లీ ఏసాడు..

2026-11-16 06:55 GMT

భారత ఐటీ కంపెనీలకు అమెరికాలో కొత్త చిక్కులు.. H-1B వీసాలపై పెరుగుతున్న ఆంక్షలు!

2026-11-16 04:28 GMT

ICE నియామకాల ప్రచారంపై విమర్శలు.. అమెరికాలో కొత్త వివాదం!

2026-11-15 05:28 GMT

అమెరికాలో ఏమైపోతోంది? మూడు నెలల కరెంట్ ఉండదనే భయంతో జనాల పరుగులు!

2026-11-14 10:43 GMT

ట్రంప్ కొంపముంచేశాడు.. అధ్యక్ష రేసు నుంచి జేడీ వాన్స్ తప్పుకుంటారా?

2026-11-14 07:19 GMT

Copyright @2026

Powered by Blink CMS