• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  USA >  అమెరికా విమానాల రద్దు...

అమెరికా విమానాల రద్దు వెనుక అసలు విలన్ ఎవరు? ఆ 4 సెకన్ల కథేంటి?

| అమెరికాలో పాత రూటర్ కారణంగా విమానయాన వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. నవంబర్ 13 నుంచి 15 వరకు 42,600 విమానాల షెడ్యూళ్లు ప్రభావితమయ్యాయి. ఇందులో 17,700 విమానాలు రద్దవగా, 24,900 విమానాలు ఆలస్యమయ్యాయి. ఎఫ్ఏఏ వాడుతున్న 138 వ్యవస్థల్లో 105 కాలం చెల్లినవేనని నివేదిక వెల్లడించింది.

By - A.N.Kumar
Update: 2026-11-16 18:55 GMT

ఏలియన్స్ దాడి చేయలేదు.. హ్యాకర్లు కన్ను వేయలేదు.. కనీసం ఒక తుపాను కూడా రాలేదు. కానీ అగ్రరాజ్యం ఆకాశంలో ఎగిరే వేలాది విమానాలు రెక్కలు తెగిన పక్షుల్లా ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి. ఒక ఇంట్లో వైఫై రూటర్ మొరాయిస్తేనే మనం కిందామీదా పడతాం.. అలాంటిది అమెరికా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎఫ్ఏఏ) రూటర్‌కు జలుబు చేస్తే ఏమవుతుందో నవంబర్ 13న ప్రపంచం కళ్లారా చూసింది. ప్రపంచానికి హైటెక్ పాఠాలు నేర్పే అమెరికా.. ఒక చిన్న ‘రూటర్’ దెబ్బకు విలవిలలాడిపోయిందంటే నమ్మశక్యంగా లేదా? కానీ నిజంగా ఇది నిజం.. ఇప్పుడు బయటపడి అందరినీ నోరెళ్ల బెట్టేలా చేసింది.

నవంబర్ 13 నుంచి 15 వరకు అమెరికా విమానాశ్రయాల్లో జరిగిన గందరగోళం చూస్తే ఏదో యుద్ధం మొదలైందేమో అనిపించింది. సుమారు 42,600 విమానాల షెడ్యూళ్లు తలకిందులయ్యాయి. ఇందులో 17,700 విమానాలు ఏకంగా రద్దయితే మరో 24,900 విమానాలు "ఇప్పుడొస్తాం.. అప్పుడొస్తాం" అంటూ ప్రయాణికులకు చుక్కలు చూపించాయి. దేశంలోని 22 ప్రధాన కంట్రోల్ కేంద్రాల్లో 17 చోట్ల సిగ్నల్స్ మాయమవ్వడంతో ఇక లాభం లేదని ఎఫ్ఏఏ దేశవ్యాప్తంగా 'గ్రౌండ్ స్టాప్' ప్రకటించింది. అంటే గాల్లో ఉన్నవి కిందకు దిగాలి తప్ప నేల మీద ఉన్నవి మాత్రం ఆకాశం వైపు చూడకూడదన్నమాట..

దర్యాప్తు చేస్తే బయటపడ్డ అసలు నిజం విని టెక్ నిపుణులు సైతం నోరెళ్లబెట్టారు. నెట్‌వర్క్‌లో ప్రతి 4 నుంచి 5 సెకన్లకు ఏకంగా 1,000 కనెక్షన్ రిక్వెస్టులు వచ్చి పడ్డాయట. పాతకాలపు టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ఆ దెబ్బకు తట్టుకోలేక చేతులెత్తేసింది. ఆర్కాన్సాస్‌లోని ఎల్ డొరాడో కేంద్రంలో పాత సామాను తీసేసి ఎల్3 హ్యారిస్ అనే సంస్థ కొత్త రూటర్ పెడుతుండగా ఈ ‘టెక్నికల్ జలక్’ తగిలిందని అంటున్నారు. ఒక రూటర్ చేసిన రచ్చకు భయపడి ముందుజాగ్రత్తగా దేశవ్యాప్తంగా మరో 60 రూటర్ల నోరు మూయించాల్సి వచ్చింది.

పైకి మాత్రం "మేమే నంబర్ వన్" అని చెప్పుకునే అమెరికా విమానయాన వ్యవస్థలో డొల్లతనం ఈ ఘటనతో బయటపడింది. సాక్షాత్తూ అమెరికా ప్రభుత్వ సంస్థ నివేదిక ప్రకారమే.. ఎఫ్ఏఏ వాడుతున్న 138 వ్యవస్థల్లో 105 ఎప్పుడో కాలం చెల్లిపోయినవి. అంటే దాదాపు 75 శాతం పాత సామానుతోనే అగ్రరాజ్యం ఆకాశాన్ని శాసిస్తోందన్నమాట.. ఇప్పుడు రవాణా మంత్రి సీన్ డఫీ "మాకు 50 బిలియన్ డాలర్లు కావాలి.. వ్యవస్థను బాగు చేస్తాం" అంటూ కొత్త రాగం అందుకున్నారు.

సాంకేతిక సమస్యను రాత్రి 8 గంటలకల్లా సరిదిద్దినా విమానయాన రంగంలో ఉండే 'డొమినో ఎఫెక్ట్' వల్ల మూడు రోజుల పాటు ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే జాగారం చేయాల్సి వచ్చింది. పైలట్ల డ్యూటీ గంటలు ముగిసిపోవడం.. కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్ అవ్వడంతో విమానాశ్రయాలు తాత్కాలిక వసతి గృహాలుగా మారిపోయాయి.

ఈ ఘటన ఒక పెద్ద గుణపాఠం. మనం ఎంతటి సూపర్ కంప్యూటర్లు వాడినా వాటికి ఆధారమైన మౌలిక సదుపాయాలు పాతబడిపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. అమెరికా లాంటి దేశానికే ఇలాంటి గతి పడితే ఇక మిగతా దేశాలు తమ బ్యాకప్ వ్యవస్థలను ఎంత గట్టిగా ఉంచుకోవాలో అర్థం చేసుకోవచ్చు. లేదంటే ఏదో ఒక రోజు ఒక చిన్న 'కేబుల్' ఊడిపోయిందని ప్రపంచం మొత్తం ఆగిపోయే రోజు రావచ్చు.. జాగ్రత్త సుమీ..

Tags:    
  • usflightchaos 
  • faa 
  • routerfailure 
  • flightcancellations 

Similar News

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

అమెరికాలో మరో షాక్.. NSA రహస్య నెట్‌వర్క్ కూడా డౌన్!

2026-11-18 06:51 GMT

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ది ఆత్మహత్యా కాదా.? పక్కా ప్లాన్‌తో చేసిన హత్యా? ఫోరెన్సిక్ విశ్లేషణతో సంచలనం

2026-11-17 12:46 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రంప్ తెచ్చిన కొత్త రూల్‌ను కొట్టేసిన కోర్టు!

2026-11-17 10:20 GMT

1.8 లక్షల మంది కోరుతున్నా.. జెన్సన్ హువాంగ్‌ను వెనక్కి తీసుకోని ఎన్విడియా!

2026-11-17 10:01 GMT

అమెరికాలో ఇరాన్ దాడికి ప్లాన్ చేస్తోందా? ట్రంప్ అధికారులకు భద్రత పెంపు!

2026-11-17 05:35 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గింది.. మాస్టర్స్ చదువుపైనే ఎక్కువ ప్రభావం!

2026-11-17 04:38 GMT

విమానాలు ఎగరలేదు.. తప్పంతా బైడెన్ దే.. నాది కాదు.. ట్రంప్ మళ్లీ ఏసాడు..

2026-11-16 06:55 GMT

ఎన్ని ఎఫైర్లు పెట్టుకున్నా మళ్లీ జెన్సన్ రావాలి.. ఎన్వీడియో పగ్గాలి చేపట్టాలట.. వైట్ హౌస్ వద్దకు పంచాయితీ..

2026-11-16 04:53 GMT

Copyright @2026

Powered by Blink CMS