• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Gadgets >  స్మార్ట్‌ఫోన్ కొనే ముందు...

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ‘కిడ్నీ’ సేఫ్‌గా ఉందో లేదో చూసుకోండి.. సామాన్యుడికి మరో ‘డిజిటల్’ షాక్

| శామ్‌సంగ్, షావోమీ సంస్థలు తమకు చెందిన 41 స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలను పెంచాయి. శామ్‌సంగ్ 22 మోడళ్లు, షావోమీ 19 వేరియంట్లపై రూ.1,000 నుంచి రూ.4,000 వరకు ధరలు పెరిగాయి. మెమరీ చిప్స్, ఇతర విడిభాగాల తయారీ ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని కంపెనీలు చెబుతున్నాయి. ఒప్పో, వివో, రియల్‌మీ కూడా ధరలు పెంచే అవకాశం ఉందనే ప్రచారం వినిపిస్తోంది.

By - A.N.Kumar
Update: 2026-11-16 11:30 GMT

ఒకప్పుడు కొత్త ఫోన్ కొనాలంటే ఏ దసరాకో.. దీపావళి వచ్చేవరకు ఎదురుచూసి "ఫ్లాష్ సేల్"లో వేగంగా బటన్ నొక్కి గెలిచినంత ఆనందపడేవాళ్లం. కానీ ఇప్పుడు కాలం మారింది. ఫోన్ కొనాలంటే పండగలు కాదు కదా.. ముందు బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుని గుండె దిటవు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఉల్లిపాయల నుంచి పెట్రోల్ వరకు అన్ని ధరలతో జేబులకు చిల్లులు పడి బాధపడుతున్న సామాన్యుడికి.. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు "మేమేం తక్కువ తిన్నామా?" అన్నట్లు మరో భారీ షాక్ ఇచ్చాయి.

మార్కెట్లో ఎప్పుడూ పోటీపడే దిగ్గజ సంస్థలు శామ్‌సంగ్, షావోమీ... ధరల పెంపు విషయంలో మాత్రం భలే ఐకమత్యం ప్రదర్శించాయి. ఈ రెండు కంపెనీలు కలిసి ఏకంగా 41 స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలను ఆకాశానికి ఎత్తేశాయి. ఇందులో శామ్‌సంగ్ 22 మోడళ్లను.. షావోమీ 19 వేరియంట్లను "ఖరీదైనవి"గా మార్చేశాయి. మోడల్‌ను బట్టి రూ.1,000 నుంచి ఏకంగా రూ.4,000 వరకు ధరలు పెంచేశాయి. కొన్ని ఫోన్లపై అయితే ఏకంగా 18.75 శాతం వరకు బాదుడు ఉందంటే.. ఇకపై కొత్త ఫోన్ కొనడం అంటే ఒక మినీ లోన్ తీసుకోవడమేనేమో!

"అసలు ధరలు ఎందుకు పెంచారు బాబూ?" అని అడిగితే కంపెనీలు ఎప్పటిలాగే పాత పాటే పాడుతున్నాయి. "తయారీ ఖర్చులు పెరిగాయి, మెమరీ చిప్స్, విడిభాగాల రేట్లు మండిపోతున్నాయి" అంటూ సాకులు చెబుతున్నాయి. ఫోన్‌లో ర్యామ్, మెమరీ పెరిగితే మనకు ఆనందం కలగాలి కానీ దానివల్ల ధర కూడా అదే రేంజ్‌లో పెరిగిపోతుంటే సామాన్యుడికి మైండ్ బ్లాంక్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో సప్లై ఖర్చులు పెరిగితే ఆ భారాన్ని ఏమాత్రం మొహమాటం లేకుండా నేరుగా వినియోగదారుడి నెత్తినే మోపుతున్నాయి ఈ సంస్థలు.

ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. శామ్‌సంగ్, షావోమీ వేసిన ఈ బాటలోనే ఒప్పో, వివో, రియల్‌మీ వంటి మిగతా బ్రాండ్లు కూడా నడవడానికి సిద్ధమవుతున్నాయట.. "వాళ్లు పెంచినప్పుడు మనం తగ్గితే బాగోదు కదా" అని ఈ కంపెనీలు కూడా రేట్లు పెంచేస్తే ఇక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అనే మాటను డిక్షనరీలో నుంచి తీసేయాల్సిందే.

ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ అంటే స్టేటస్ సింబల్. కానీ ఇప్పుడు అది లేకపోతే ఇంట్లో పాల ప్యాకెట్ నుంచి ఆఫీస్ మీటింగ్ వరకు ఏ పనీ జరగదు. ఆన్‌లైన్ క్లాసులు, యూపీఐ పేమెంట్లు, ప్రభుత్వ పథకాలు... అన్నీ ఆ ఆరంగుళాల తెరలోనే ఉన్నాయి. ఇలాంటి టైమ్‌లో రూ.10 వేల నుంచి రూ.20 వేల మధ్యలో ఓ మంచి ఫోన్ కొనుక్కుందామనుకునే మధ్యతరగతి జీవి ఆశలపై కంపెనీలు నీళ్లు చల్లాయి.

ఇకపై పాత ఫోన్ పగిలిపోయినా.. స్లో అయినా కొత్తది కొనడానికి రెండుసార్లు ఆలోచించాలి. "ఉన్న ఫోన్‌నే టేప్ వేసి వాడుకుందామా? లేక కొత్త ఫోన్ కొని నెలంతా పస్తులుందామా?" అనే కొత్త సందిగ్ధం మొదలైంది. టెక్నాలజీ పెరుగుతోంది.. ఫీచర్లు మారుతున్నాయి... కానీ వాటితో పాటు మన గుండె దడ కూడా పెరుగడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    
  • smartphonepricehike 
  • samsung 
  • xiaomi 
  • smartphones 
  • mobileprices 

Similar News

మార్కెట్ ట్రెండ్: దిగొచ్చిన బంగారం - వెండి ధ‌ర‌లు

2026-11-15 19:27 GMT

టచ్‌స్క్రీన్‌తో కొత్త MacBook Pro.. యాపిల్ నుంచి సరికొత్త ల్యాప్‌టాప్!

2026-10-29 07:12 GMT

రూ.3 లక్షల ఐఫోన్‌పై తొలిరోజే ఫిర్యాదులు.. ఫోల్డబుల్ టెక్నాలజీకి యాపిల్ అసలైన పరీక్ష

2026-10-27 10:23 GMT

ఐఫోన్ డూయో సంచలనం.. 11 వేల సార్లు ఫోల్డ్ చేసినా చెక్కుచెదరని మన్నిక..

2026-10-22 16:22 GMT

ఐఫోన్ ధరలు చూసి జనం పారిపోతున్నారా? యాపిల్ బాస్‌కు నిద్ర పట్టట్లేదట..

2026-10-10 07:48 GMT

4 రోలెక్స్ వాచీల ధ‌ర 400 కోట్లు.. మ‌న స్టార్ల‌కు ఎందుకు అంత పిచ్చి?

2026-10-02 13:03 GMT

ఐఫోన్ (X) ఆండ్రాయిడ్ 2026 : అస‌లు ఏంటి ఆ రెండిటిలోని వైవిధ్యం? ఏది బెస్ట్?

2026-09-17 02:45 GMT

'ఫోల్డ‌బుల్ ఫోన్‌' తో యాపిల్ దూకుడు.. ధ‌ర‌లు చూస్తే షాకింగే!

2026-09-10 04:04 GMT

స్మార్ట్ ఫోన్ లవర్స్ కి నథింగ్ బిగ్ అలెర్ట్!

2026-06-13 04:00 GMT

వీడియో వైరల్.. మనిషి కంటే ముందే గమ్యం చేరుకున్న రోబో.. ఆశ్చర్యపోతున్న జనం..

2026-04-20 08:30 GMT

దేశీయ మార్కెట్ లో దూసుకెళుతున్న యాపిల్

2026-02-03 04:34 GMT

Copyright @2026

Powered by Blink CMS