స్మార్ట్ ఫోన్ లవర్స్ కి నథింగ్ బిగ్ అలెర్ట్!
ఇలా ప్రతి విషయంలో కూడా తోడుంటూ అన్నివేళలా మనిషిని మరింత స్మార్ట్ గా మారుస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ లను సొంతం చేసుకోవాలని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది నిత్యవసరంగా మారిపోయింది. ఇంట్లో సరుకులు , కూరగాయలు ఎలా అయితే నిత్యవసరంగా మారిపోయాయో ..అటు స్మార్ట్ ఫోన్ కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది. వినోదాన్ని పంచడమే కాదు సమాచారాన్ని చేరవేయడమే కాదు బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఇంట్లో కూర్చుని లేదా ఎక్కడైనా సరే చేతివేళ్లతో పని అయిపోతుంది. ఇలా ప్రతి విషయంలో కూడా తోడుంటూ అన్నివేళలా మనిషిని మరింత స్మార్ట్ గా మారుస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ లను సొంతం చేసుకోవాలని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఆఫర్ల కోసం ఎదురుచూస్తే జేబుకు చిల్లే..
అయితే ఫీచర్ ని బట్టి ధరలు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కో రకమైన ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తూ ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్ కొనాలని ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు ఫీచర్స్ అధికంగా ఉండాలి ధర తక్కువగా ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకు తగ్గట్టే ఆఫర్లు వచ్చేవరకు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఆఫర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటే మీ జేబుకు చిల్లే అని.. ఏదైనా ఉంటే ఇప్పుడే కొనుగోలు చేయాలని.. లేకపోతే ఆ ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి అంటూ ఒక దిగ్గజ మొబైల్ కంపెనీ ప్రజలకు హై అలెర్ట్ విధించింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు హై అలర్ట్..
మార్కెట్లో శాంసంగ్, గూగుల్, మోటోరోలా , నథింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దిగ్గజ బ్రాండ్ కంపెనీలు ప్రజలకు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఒక్కో ఫోన్ ఒక్కో రకమైన ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంటే.. ఆయా ఫీచర్లకు ఇష్టపడిన ప్రజలు వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు.అలా స్మార్ట్ ఫోన్ రంగంలో తనదైన ఫీచర్స్ తో యూజర్స్ ను ఆకట్టుకుంటూ దిగ్గజ బ్రాండ్ గా అవతరించింది నథింగ్. అయితే ఇప్పుడు ఈ కంపెనీ కో ఫౌండర్ సీఈఓ కార్ల్ పీ తాజాగా మాట్లాడుతూ.. కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారు ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలని లేకపోతే వీటి ధరలు భారీగా పెరగనున్నాయని తెలిపారు.
రంగంలోకి ఏ ఐ.. ఆకాశాన్ని అంటుతున్న మెమొరీ చిప్స్ ధరలు!
ధరలు పెరగడానికి గల కారణాన్ని కూడా ఆయన వివరించారు. ఏఐ పెరుగుతున్న డిమాండ్ కారణంగా మెమొరీ చిప్స్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీని ఎఫెక్ట్ 2026 మొత్తం మొబైల్ మార్కెట్ పై ఉంటుందని హెచ్చరించారు వరుసగా పోస్ట్లు కూడా పెట్టారు కార్ల్ పీ. గడిచిన గత 10 సంవత్సరాలుగా డిస్ప్లేలు, మెమొరీ చిప్స్ ధరలు క్రమంగా తగ్గుతూ రావడంతో కంపెనీలు కూడా తక్కువ ధరకే మంచి ఫీచర్లతో ఫోన్లను అందించాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు ఏఐ అవసరాల కోసం సెమీ కండక్టర్లు, మెమొరీ ప్రొడక్షన్ కెపాసిటీని కొన్ని సంవత్సరాల ముందే బుక్ చేసుకుంటున్నాయి. ఫలితంగా స్మార్ట్ ఫోన్ తయారీదారులకు మెమొరీ చిప్స్ కొరత భారీగా పెరిగింది. ముఖ్యంగా కొన్ని రకాల మెమొరీ చిప్స్ ధరలు అయితే ఏకంగా 300% పెరిగాయి.
ఆఫర్లు ఉండవు..అధిక భారం మోయాల్సిందే..
ఒకప్పుడు ఫోన్ తయారీ ఖర్చులో ప్రాసెసర్, డిస్ప్లేలు ఖరీదు అయితే.. ఇప్పుడు మెమొరీ చిప్స్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఏడాది క్రితం వరకు ఫోన్ తయారు చేయాలి అంటే మెమొరీ కోసం కేవలం రూ.1900 ఖర్చయ్యేది. కానీ ఏడాది చివరి నాటికి ప్రీమియం ఫోన్లో మెమొరీ కోసమే ఏకంగా రూ.9500 కంటే ఎక్కువ ఖర్చవుతుంది. ఒక ఫోన్ హార్డ్వేర్ ఖర్చులో 50% కంటే ఇది ఎక్కువ. దీంతో స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల కంపెనీలు కూడా ధరలు పెంచాలా లేక ఫీచర్లు తగ్గించాలా అనే డైలమాలో పడ్డాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి లాంచ్ అయిన కొన్ని ఫోన్ల రేట్లు పాత మోడల్స్ కంటే 100 డాలర్ల మేర పెరిగాయి. సేల్స్ సీజన్లో కూడా ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్ లు లేకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి కొత్త ఫోన్ కొనాలంటే ఇప్పుడే కొనండి. లేకపోతే అధిక భారం మోయక తప్పదు అంటూ ఆయన హెచ్చరించారు.