దేవుడి నగలు తాకట్టు..టీటీడీ పూజారికి 6 నెలల జైలు శిక్ష!
తిరుపతి లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆదీనంలో ఉన్న శ్రీ కోదండ రామస్వామి ఆలయంలోని బంగారు నగలు తాకట్టు పెట్టిన కేసులో ప్రధాన పూజారికి 6 నెలలు జైలు శిక్ష పడింది. 2009లో స్వామివారి బంగారు నగలను ఆలయ ప్రధాన అర్చకుడు వెంకట రమణ దీక్షితులు కొదవ పెట్టారు. ఈ మేరకు 2009 ఆగస్టు 21న టిటిడి విజిలెన్స్ ఫిర్యాదు మేరకు తిరుపతి వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో ఆలయ ప్రధాన అర్చకుడుతో పాటు కుదువ వ్యాపారులు సాగరమల్లు, రాఘవరెడ్డి లపై ఐపీసీ 409, 420, 411 కింద కేసులు నమోదయ్యాయి.
ఈ కేసును విచారించిన అదనపు మున్సిఫ్ కోర్టు 2015లో ఆలయ ప్రధాన అర్చకుడు వెంకట రమణ దీక్షితులుతో పాటు మరో ఇద్దరికీ మూడేళ్ల జైలు శిక్ష, 5 వేలు జరిమానా విధించింది. తీర్పుపై ఆలయ ప్రధాన అర్చకుడు వెంకట రమణ దీక్షితులు అప్పీలుకు వెళ్లారు. ఈ మేరకు ఇరు వర్గాల వాదనలు విన్న మూడవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు తాజాగా తీర్పు వెలువరించింది. కేసులో నిందితుడుగా ఉన్న వెంకట రమణ దీక్షితులుకు 6 నెలల జైలు శిక్షతో పాటు 5 వేల రూపాయలు జరిమానా విధించింది. మిగిలిన ఇద్దరి పై ఉన్న కేసు కొట్టివేసింది.