పేరు తెలంగాణది.. నిధులు ఏపీకా.. కేంద్రంపై కేటీఆర్ గట్టి కౌంటర్
దేశంలో మోడీ-షాల రాజ్యం నడుస్తున్నాక.. ఏ ప్రాజెక్టు అయినా గుజరాత్ కే తరలిపోతోంది. ఇక రెండు మూడు రాష్ట్రాలకు కేటాయింపులు అయితే అందులో గుజరాత్ ఒక్కటి ఖచ్చితంగా ఉంటోంది. తాజాగా బల్క్ డ్రగ్స్ మూడు రాష్ట్రాలకు కేటాయించారు. అందులో గుజరాత్ తోపాటు తెలంగాణకు ప్రకటించారు. కానీ కేటాయింపులు వచ్చేసరికి తెలంగాణను లేపేసి ఏపీకి ఇచ్చారు. ఇదేం అన్యాయం అని కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు నెత్తినోరు బాదుకుంటున్నారు. కేంద్రం ఇదే కాదు.. తెలంగాణకు కేటాయించిన ఎన్నో ప్రాజెక్టులను గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాలకు ట్రాన్స్ ఫర్ చేసి తన సవతి ప్రేమను చాటుకుంది.
లోక్ సభ సమావేశాల్లో బల్క్ డ్రగ్స్ పార్క్ లను మంజూరుపై కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఒక ప్రకటన చేశారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ తోపాటు హైదరాబాద్ కు బల్క్ డ్రగ్స్ పార్క్ లను మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఇందుకు రూ.1000 కోట్లు అవసరమని అంచనావేశామని.. తొలి విడత ఒక్కొక్కదానికి రూ.300 కోట్ల చొప్పున విడుదల చేస్తామని శుక్రవారం లోక్ సభలో ప్రకటించారు.
అయితే లిఖితపూర్వక సమాధానంలో మాత్రం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు బల్క్ డ్రగ్ పార్క్ ను మంజూరు చేసినట్టు పేర్కొనడం దుమారం రేపింది. ఇందులో తెలంగాణ పేరు లేకపోవడం అందరినీ షాక్ గురిచేసింది. పేరు తెలంగాణది చెప్పి.. నిధులు ఏపీకి ఇవ్వడంపై దుమారం రేపింది. ఈ నేపథ్యంలో కేంద్రం వైఖరిపై మంత్రి కేటీఆర్ తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు.
అబద్ధాలతో పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించిన ఈ కేంద్రమంత్రిపై లోక్ సభలో హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తప్పుదోవ పట్టించినందుకు తెలంగాణ ప్రజలకు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
పెద్ద అబద్ధంతో తెలంగాణ హృదయాన్ని గాయపరిచారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. భారతదేశ లైఫ్ సైన్సెస్ హబ్ కు బల్క్ డ్రగ్ పార్క్ కు ఇవ్వకుండా తీరని అన్యాయం చేశారన్నారు. జాతి ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే బీజేపీ ప్రాధాన్యం ఇస్తోందని మండిపడ్డారు.