ట్రంప్ ఆరోగ్యం సీరియస్? రానున్న 48 గంటలు కీలకమట
అనూహ్యంగా కరోనా బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ఎలా ఉందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.దీనికి ట్రంప్ నుంచి వచ్చిన సందేశాన్ని చూస్తే.. తాను క్షేమంగా ఉన్నానని.. ఆసుపత్రిలోని అధ్యక్ష కార్యాలయం నుంచే తాను కొద్ది రోజుల పాటు పని చేస్తానని చెప్పినట్లుగా వైట్ హౌస్ పేర్కొంది. తానెంతో బాగున్నట్లు చెప్పే పద్దెనిమిది నిమిషాల వీడియోను ట్రంప్ పోస్టు చేశారు.
తాజాగా ఆయనకు రెమ్ డెసివిర్ తో పాటు ప్రయోగాత్మక యాంటీబాడీ ఔషధాల్ని ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. ట్రంప్ ఆరోగ్యంపై మీడియాలోనూ.. రాజకీయ వర్గాల్లోనూ మరో రకమైన చర్చ తీవ్రంగా సాగుతోంది. ఆయన ఆరోగ్యం ఆందోళన కరంగా ఉన్నట్లు చెబుతున్నారు.
రానున్న 48 గంటలు చాలా కీలకమని స్పష్టం చేస్తున్నారు. ఈ ఆందోళనకు కారణం లేకపోలేదు. కరోనా బారిన పడిన ట్రంప్.. మొదటి 24 గంటల్లో ఆయనకు చెందిన ముఖ్యమైన అవయువాలు తీవ్రంగా ప్రభావితమైనట్లుగా వైట్ హౌస్ కు చెందిన అధికారి ఒకరు వివరించినట్లుగా మీడియాలో వచ్చింది.
కరోనా పాజిటివ్ తర్వాత ఆసుపత్రిలో చేరిన తర్వాతే ట్రంప్ గుండె..కాలేయం.. మూత్రపిండాల పని తీరు కాస్తంత మెరుగుపడినట్లుగా చెబుతున్నారు. ఆయన కోలుకుంటున్నారని.. ప్రస్తుతానికి శ్వాస సంబంధమైన ఇబ్బందులు లేవని చెబుతున్నారు. అధికారిక సమాచారం ప్రకారం ఆయనకు ఢోకా లేదన్న మాట వినిపిస్తుంటే.. అందులో నిజం పాక్షికమేనని.. రాబోయే 48 గంటలు చాలా కీలకమని స్పష్టం చేస్తున్నారు. దీంతో.. అమెరికాలో ఉద్విగ్న వాతావరణం నెలకొని ఉంది.