మరోసారి ట్రంప్ కు కరోనా పరీక్ష.. ఎందుకంటే?

Update: 2020-05-08 10:30 GMT
ప్రపంచంలో మరే దేశాధ్యక్షుడికి చేయనన్ని కరోనా పరీక్షలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు చేస్తున్నారా? అంటే అవుననే మాట చెప్పాలి. ఆ మధ్యన రెండు మూడుసార్లు కరోనా పరీక్షను ట్రంప్ కు చేశారు. తాజాగా మరోసారి ఆయనకు.. ఆయన వ్యక్తిగత సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు.

వైట్ హౌస్ లో పని చేసే మిలటరీ సిబ్బందికి కరోనా వైరస్ సోకటంతో అమెరికా అధికారులు అప్రమత్తం అయ్యారు. పాజిటివ్ గా తేలిన వారితో పని చేసిన వారిని తక్షణం క్వారంటైన్ కు పంపారు. ఇక.. ట్రంప్ కు దగ్గర పని చేస్తున్న వారందరికి ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పరీక్షలు నిర్వహించారు.

పనిలో పనిగా దేశ అధ్యక్షుడు ట్రంప్ కు.. ఉపాధ్యక్షుడు  మైక్ పెన్స్ కు కోవిడ్ టెస్టుల్ని నిర్వహించారు. రిపోర్టుల్లో వీరిద్దరికి నెగిటివ్ ఫలితం వచ్చినట్లుగా వైట్ హౌస్ వెల్లడించింది. ట్రంప్ వ్యక్తిగత సహాయకుల్లో ఒకరికి పాజిటివ్ గా తేలిన నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తల్ని తీసుకుంటున్నారు. ప్రపంచంలో అత్యధిక కేసులు అమెరికాలో నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో ప్రస్తుతం 9.80 లక్షల యాక్టివ్ కేసులు ఉండగా.. బాధితుల్లో 15, 827 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News