ట్రంప్​ ను చూసుకుంటున్న డాక్టర్​ ఎవరూ? షాకింగ్​ నిజాలు

Update: 2020-10-06 07:15 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రస్తుతం కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ట్రంప్​కు వైద్యం చేస్తున్న డాక్టర్లు ఎవరు? ఆయనకు ఎటువంటి చికిత్స అందిస్తున్నారు? వంటి విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ట్రంప్​ను కంటికి రెప్పలా కాపాడుతున్న వైద్యుడు డాక్టర్​ సీన్​ కాన్లీ .. ఇటీవలే ఆయన మీడియా ముందుకు వచ్చి అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యం గురించి ప్రపంచానికి తెలిపారు.  అధ్యక్షుడి ఆరోగ్యం మెరుగుపడిందని .. ఆయన ప్రస్తుతం ఎంతో హెల్దీగా ఉన్నారని సీన్​ కాన్లీ చెప్పారు.

కానీ ట్రంప్​ ప్రధానభద్రతాధికారి మాత్రం అందుకు విరుద్ధమైన విషయాలు చెప్పారు. ఆయన ఆరోగ్యం ఏమంత బాగోలేదని.. ఇంకా క్రిటికల్​గానే ఉందని ఆయన తెలపడం గమనార్హం. దీంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది.  అయితే తొలుత సీన్​ కాన్లీ ట్రంప్​ సహజంగానే శ్వాస తీసుకుంటున్నాడని చెప్పారు. కానీ కొద్ది గంటల్లోనే ఆయన మాట మార్చారు. ట్రంప్​ కృత్రిమ పద్ధతుల్లోనే ఆక్సిజన్​ ఇస్తున్నట్టు చెప్పారు. తరచూ విరుద్ధ ప్రకటనలతో ట్రంప్​ ఆరోగ్యంపై గందరగోళం సృష్టించారు.

సీన్ కాన్లీ ఎవరు?
సీన్ కాన్లీ 2018 నుంచి ట్రంప్ కు వ్యక్తిగత వైద్యుడిగా పనిచేస్తున్నారు. నిజానికి కాన్లీ ఓ మిలటరీ అధికారి. అమెరికా అధ్యక్షులకు మిలటరీ అధికారులే వైద్యులుగా పనిచేస్తూ ఉంటారు.  మిలటరీ వైద్యులతో  సత్వరమే స్పందిస్తారు. విపత్కర పరిస్థితులను సైతం ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటారు. అందుకే కాన్లీ నియమించి ఉంటారని పలు బ్రిటన్​ పత్రికలు అభిప్రాయపడుతున్నాయి.  సీన్ కాన్లీ.. పెన్సిల్వేనియా రాష్ట్రం డోలెస్టోన్‌కు చెందినవారు. 2002లో యూనివర్సిటీ ఆఫ్ నోట్రడామ్ నుంచి వైద్య పట్టా తీసుకున్నారు. ఆ తరువాత ఫిలడెల్ఫియా కాలేజీలో ఆస్టియోపతిక్ మెడిసిన్ చదివారు. 2006లో ఆయనకు డాక్టర్ ఆఫ్ ఆస్టియోపతిక్ మెడిసిన్ పట్టా వచ్చింది. ఆస్టియోపతిక్ మెడిసిన్ అనేది జీవనశైలి, పర్యావరణ కారకాలను దృష్టిలో పెట్టుకుని మరింత ఫోకస్డ్‌ గా అందించే సమగ్ర చికిత్స.2014లో ఆయన అఫ్గానిస్తాన్‌ లో నాటో మెడికల్ యూనిట్‌ లో 'చీఫ్ ఆఫ్ ట్రామా'గా పని చేశారు. 2018 మార్చి నుంచి అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యక్తిగత వైద్యుడిగా పనిచేస్తున్నారు.
Tags:    

Similar News