అధికారం ఎండమావిగన్...వైసీపీలో కలవరం ?

ఎండ మావులలో నీరు ఉంటుందని వెతికి వేసారడం ఎంత భ్రమగా ఉంటుందో అలాగే మావిగన్ ద్వారా టీడీపీకి కంచుకోటల లాంటి గుంటూర్ కృష్ణా జిల్లాలలో వైసీపీకి సానుభూతి వస్తుందని ఊహించుకోవడం అంతే భ్రమ భ్రాంతి అని అంటున్నారు.;

Update: 2026-04-11 03:30 GMT

ఎండ మావులలో నీరు ఉంటుందని వెతికి వేసారడం ఎంత భ్రమగా ఉంటుందో అలాగే మావిగన్ ద్వారా టీడీపీకి కంచుకోటల లాంటి గుంటూర్ కృష్ణా జిల్లాలలో వైసీపీకి సానుభూతి వస్తుందని ఊహించుకోవడం అంతే భ్రమ భ్రాంతి అని అంటున్నారు. 2019లో అయితే అప్పటి పరిస్థితుల ఆధారంగా ఈ జిల్లాలో మెజారిటీ సీట్లు వైసీపీకి దక్కినా మళ్లీ ఎప్పటికీ అలాంటి సన్నివేశాన్ని ఎవరూ చూడలేరని అంటున్నారు. వైసీపీ 2019 నుంచి 2024 దాకా సాగించిన పాలన మూడు రాజధానుల ఇష్యూలో ఎంత దాకా లాగాలో అంతదాకా లాగిన తీరు, ఈ రోజుకీ విశాఖే మంచి రాజధాని అని పొగుడుతున్న వైనం ఇవన్నీ చూసిన వారికి మావిగాన్ అని జగన్ చెబితే టర్న్ అయిపోయే సీఎన్ ఉండదని అంటున్నారు.

సెంటిమెంట్ అని తెలిసి :

రాజకీయాల్లో పొరపాట్లు సహజం. అయితే వాటిని ఎంత తొందరగా దిద్దుకున్నారు అన్న దాని మీదనే ఏ రాజకీయ పార్టీ భవిష్యత్తు అయినా ఆధారపడి ఉంటుందని అంటారు. వైసీపీ అయితే తెలిసో తెలియకో మూడు రాజధానులను తలకెత్తుకుంది. దానికి కారణం మూడు ప్రాంతాలకు న్యాయం చేయాలని ఆ పార్టీ ఆలోచనలు కూడా కావచ్చు అని అంటున్నారు. అయితే మూడు ప్రాంతాలలో జనాలు 2024 ఎన్నికల్లో ఒక్కటే తీర్పు ఇచ్చి వైసీపీకి భారీ షాక్ ఇచ్చేశారు. అది జరిగిన తరువాత అయినా వైసీపీ తీరు మార్చుకోవాలి కదా అని అంటున్నారు. అంతే కాదు రాజధాని అన్నది ఒక సెంటిమెంట్ అన్నది వైసీపీ ఎప్పటికి తెలుసుకుంటుందని అంటున్నారు.

కార్నర్ అవుతున్నారు :

ఈ రోజు మావిగాన్ అంటున్నారు, నిన్న మూడు రాజధానులు చెప్పారు, రేపు ఏమి చెబుతారో అని కూడా జనాలు అనుకునే నేపథ్యం ఉంది. అంతే కాదు ఏపీ రాజధాని అంటే అంత తేలిక వ్యవహారమా అయిదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ సీరియస్ ఇష్యూని ఇలా లైట్ తీసుకుంటే ఎలా అన్నది సైతం జనంలో చర్చగా మారుతోంది. అంతే కాదు కోస్తా జిల్లాలలో అసలే కూటమి బలంగా ఉంది. జనసేన టీడీపీ డెడ్లీ కాంబో 2029 లో కూడా కంటిన్యూ అవుతుందని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ఉన్నవి చాలవు అన్నట్లుగా మావిగాన్ అని వింత ప్రతిపాదనలు చేయడం ద్వారా మరింత వ్యతిరేకత తెచ్చుకోవడం తప్ప ఇంకేమీ కాదని అంటున్నారు

పంతమే ముఖ్యమా :

వైసీపీ అధినాయకత్వానికి పంతం పట్టుదలనే ముఖ్యమా అని కూడా వైసీపీలో చర్చ సాగుతోందిట. ముందు అధికారంలోకి వచ్చే మార్గం చూసుకోవాల్సింది పోయి ఈ తరహా ప్రతిపాదనలతో ట్రోలింగ్ మెటీరియల్ కావడమేంటి అని అంటున్నారు. నిజానికి సమస్యలు అన్నవి అధికార పార్టీకి వస్తాయని విపక్షంలో ఉన్న పార్టీ ఏరి కోరి తగిలించుకుంటోంది అని కూడా పార్టీలో చర్చ సాగుతోంది అని అంటున్నారు. నిజానికి చూస్తే వైసీపీ వాస్తవాలు గమనించడం లేదా అన్న మాట కూడా ఉంది అంటున్నారు.

టఫ్ ఫైట్ ఖాయం :

కూటమి ఇదే తీరున కలసి కట్టుగా ఎన్నికల బరిలోకి దిగితే టఫ్ ఫైట్ సాగుతుందని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. అలాంటిది మూడేళ్లకు ముందే కీలక విషయాల మీద సరైన ఆలోచనలు చేయలేక విమర్శల పాలు అవుతున్న వైసీపీ 2029 లో ఎలా ఫేస్ చేస్తుంది అని కూడా అంటున్నారు. ఇకనైనా వైసీపీ రాజధాని విషయంలో మౌనంగా ఉంటే మేలు అని పార్టీలోనే చర్చ నడుస్తోంది అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బాపట్ల జిల్లా దాకా ఉన్న ప్రాంతంలోని వైసీపీ నాయకులు అయితే మావిగన్ అంటూ రాజధాని మీద చేస్తున్న ప్రకటనలు మరింత గట్టిగా ఒకటికి పదిసార్లు చెప్పడంతో జనాలలో వ్యతిరేకత పెరుగుతుందని అంటున్నారు.

నేల విడిచి సాము :

లక్షల కోట్లు అమరావతి రాజధానికి ఖర్చు అంటున్న జగన్ ఇప్పటికే అక్కడ అరవై వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టిన ఖర్చు మీద ఏమి మాట్లాడుతారని అంటున్నారు. ఆ నష్టం కష్టం రైతులు ఇచ్చిన భూములు అలాగే అక్కడ కట్టిన భవనాలు ఇవన్నీ వృధా పెట్టాల్సిందేనా అని అంటున్నారు. అందుకే నిర్ణయం తీసుకోకముందు వంద ఆలోచనలు చేయవచ్చు కానీ ఒక్కసారి అయిపోయాక ముందుకు సాగాల్సి ఉందని సూచిస్తున్నారు. వీలైతే అమరావతి రాజధాని విషయంలో ఏమైనా సలహా సూచనలు ఇవ్వడం తప్పించి అమరావతి రాజధాని వద్దు తయారవదు అని చెప్పడం ద్వారా వైసీపీ రాజకీయంగా మరింత ఇబ్బందుల పాలు అవుతుందనే అంటున్నారు.

Tags:    

Similar News