ముందు మునిసిపల్ ఎన్నికలు...కూటమి పక్కా వ్యూహం
ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఏపీలో రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.;
ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఏపీలో రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీని చిత్తు చేసి మరీ 95 శాతం స్ట్రైక్ రేటు తో బంపర్ సక్సెస్ ని కొట్టిన టీడీపీ కూటమి ఈ మధ్యలో ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ఏ రకమైన అవకాశం రాలేదు. అయితే ఇపుడు అటువంటి సందర్భం వస్తోంది. ఏపీలో లోకల్ బాడీలకు ఎన్నికలు పెట్టాల్సిన అనివార్యత ఉంది. మార్చిలోనే మునిసిపాలిటీలు అలాగే కార్పోరేషన్ల పదవీ కాలం పూర్తి అయిపోయింది. ఏప్రిల్ 2 నుంచి గ్రామ పంచాయతీల పదవీ కాలం కంప్లీట్ అయింది. జూన్ లో జిల్లా మండల పరిషత్తుల పదవీ కాలం సైతం పూర్తి అవుతుంది. దాంతో కూటమి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి చూస్తోంది.
పట్టణాల మీద నుంచి :
ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ఒక పక్కా ప్లాన్ తో వెళ్తోంది. ముందుగా పట్టణాలలోనే జనం పల్స్ తెలుసుకోబోతోంది. వాస్తవంగా చెప్పాలీ అంటే మొదటి నుంచి టీడీపీకి అర్బన్ సెక్టార్ లో మంచి పట్టు ఉంది. వైసీపీ పుట్టిన నాటి నుంచి రూరల్ బేస్ లోనే బలం పెంచుకుంటూ వస్తోంది. అర్బన్ లో తటస్థులు మేధావులు చదువరులలో అత్యధిక శాతం మంది టీడీపీ వైపీ ఉంటూ వస్తున్నారు అది అనేక ఎన్నికల్లో రుజువు అవుతూ వస్తోంది. దీంతో సెంట్ పర్సెంట్ విక్టరీని స్థానిక ఎన్నికల్లో కొడతామని గట్టిగా చెప్పుకుంటున్న టీడీపీ కూటమి మున్సిపల్ పోరుతోనే గ్రాండ్ గా శుభారంభం పలకాలని నిర్ణయించింది అంటున్నారు.
కేబినెట్ లో చర్చ :
ఏపీలో స్థానిక ఎన్నికల గురించి కేబినెట్ లో ప్రత్యేకంగా చరించారు అని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల అభిప్రాయాలని తెలుసుకున్నారు అని అంటున్నారు. తొందరలోనే ఎన్నికలకు వెళ్ళాలని ఒక అభిప్రాయం అయితే కేబినెట్ లో వ్యక్తం అయింది అని అంటున్నారు. దాంతో పాటు ముందుగా పదవీకాలం పూర్తి అయింది కాబట్టి మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల నుంచే ఎన్నికల నగారా మోగించాలని చూస్తున్నారు. వందకు పైగా మునిసిపాలిటీలు ఉన్నాయి, అలాగే దాదాపుగా డజన్ కి పైగా కార్పొరేషన్లు ఉన్నాయి. వీటికి ఎన్నికలను పెట్టాలని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నాలుగు నెలలలో :
ఆగస్టు నాటికల్లా మునిసిపల్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. అది కూడా 2011 జనాభా లెక్కల ప్రకారమే వెళ్లాలని ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది అని అంటున్నారు ఇక బీసీలకు రిజర్వేషన్లు ఉంటాయని చెబుతున్నారు. దీని కోసం ఒక కమిషన్ ని కూడా ప్రభుత్వం నియమించింది. ఆ నివేదిక తొందరలో వస్తుందని అంటున్నారు. అన్నీ చూసుకున్న మీదట వేసవి ఎండలు పూర్తి అయితే ఎన్నికలకు వెళ్ళాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉంది.
బాబు లోకేష్ దిశా నిర్దేశం :
ఇక మునిసిపల్ ఎన్నికల్లో భారీ విజయాలను నమోదు చేయాలని ఇప్పటి నుంచే జనాల్లో ఉండాలని చంద్రబాబు లోకేష్ ఇద్దరూ దిశా నిర్దేశం చేస్తున్నారు. మంత్రులకు చంద్రబాబు అయితే ముఖ్యమంత్రి హోదలఓ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు వస్తున్నాయి సిద్ధం అయిపోవాల్సిందే అని ఆయన చెప్పేశారు. లోకేష్ సైతం పార్టీ నేతలకు స్థానిక ఎన్నికలకు పూర్తి సన్నద్ధతతో ఉండాలని చెప్పేశారు. మొత్తం మీద చూస్తే మునిసిపాలిటీలు కార్పోరేషన్లు నూరు శాతం గెలుచుకుని ఆ ఊపులో మండప జిల్లా పరిషత్తులు నిర్వహించాలని చివరిలో పంచాయతీలకు ఎన్నికలు పెట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది అని అంటున్నారు. మరి విపక్ష వైసీపీ ఈ ఎన్నికలను ఎలా ఫేస్ చేస్తుందో చూడాల్సి ఉంది.