కమల హారిస్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Update: 2020-08-12 10:30 GMT
డెమొక్రటిక్ పార్టీ భారతీయ సంతతికి చెందిన కమల హ్యారిస్ ను ఉపాధ్యక్ష పదవి బరిలో నిలపడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి షాకిచ్చింది. ఈ నిర్ణయంతో ట్రంప్ ఉలిక్కిపడ్డారు. జో బిడెన్ తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం... భారతీయ ఓట్లన్నిటిని ప్రభావితం చేసే అవకాశం ఉందని ట్రంప్ కి అర్థమైంది. కానీ ఇపుడు దానికి విరుగుడు ట్రంప్ చేతిలో ఏం లేదు. దీంతో అతను కమల హ్యారిస్ పై తన నోటిదురుసును ప్రదర్శించారు.

భారతీయ మూలాలున్న సెనేటర్ కమలా హారిస్ ఓ భయంకరమైన మహిళ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రైమరీల స్థాయిలో నామినేషన్ కోసం పోటీ పడుతున్నప్పుడు హ్యారిస్ ను గమనించాను. ఆమె అసమర్థతను చూసి పక్కన పెట్టేశాను. ఆమె బలహీనతలను చూసి విస్మయం చెందాను. అలాంటి మహిళను జో బిడెన్ ఎన్నుకోవడం ఆశ్చర్యకరంగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ట్రంప్ అక్కడితో ఆగలేదు. సెనేట్ గౌరవానికి ఏ మాత్రం సరితూగని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది హ్యారిస్ మాత్రమే అని ట్రంప్ తన అక్కసు చాటుకున్నారు. జాత్యహంకార విధానాలకు జో బిడెన్ మద్దతు ఇస్తున్నారని ట్రంప్ఆరోపించడం కొసమెరుపు. ఎందుకంటే ట్రంప్ శ్వేతజాతి విధానాలు, రిపబ్లికన్ల వర్ణ వివక్ష అందరికీ తెలిసిందే. అమెరికా పౌరులు అయిన నల్లజాతి వారికి పదవి దక్కింది డెమొక్రటిక్ పార్టీయే. ఇపుడు హ్యారిస్ ను ఎంపిక చేసింది కూడా డెమొక్రాట్సే. అమెరికాలో అత్యధికుల మెప్పు పొందిన అధ్యక్షుడు బరాక్ ఒబామా... హ్యారిస్ గొప్ప మహిళ అంటూ కితాబు ఇచ్చారు. ఇది రిపబ్లికన్స్ కి ఏమాత్రం మింగుడపడటం లేదు.
Tags:    

Similar News