ఎన్నికలొచ్చే..ఆ అధ్యక్షుడి రాసలీలలపై పుకార్లు షురూ ఆయే!

Update: 2020-09-18 03:45 GMT
గత సారి అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసిన  సమయంలో ట్రంప్ పై లెక్కలేనన్ని  లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఎంతో మంది మీడియా ముందుకు వచ్చి ఆయన లైంగిక  వేధింపులపై ఏకరువు పెట్టారు. 'నన్ను రేప్ చేశాడని, నా తో సంబంధం పెట్టుకుని వదిలేశాడని అంటూ ఆయన వయసు లో వున్నప్పుడు చేసిన రాసలీలలపై విమర్శలు వ్యక్తం చేశారు. అయినా అవేమి ఆయన అధ్యక్షుడు కావడానికి అడ్డంకి  కాలేదు. ఎన్నికల్లో విజయ ఢంకా మోగించారు. ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఎంతో మంది మోడళ్లు ట్రంప్  తమతో నడిపిన యవ్వారాల  గురించి అనుభవాలను తెలిపే  వాళ్ళు. ఇలా అమెరికా అధ్యక్షుడి మీద నిత్యం ఏదో ఒక ఆరోపణ రావడం మామూలైపోయింది. ఇప్పుడు మరో సారి అమెరికాలో ఎన్నికల హంగామా మొదలైంది. రిపబ్లిక్,  డెమోక్రాటిక్ పార్టీల అభ్యర్థులు ట్రంప్, బైడెన్ పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో షరామామూలుగా మరోసారి ట్రంప్ పై లైంగిక ఆరోపణలు మొదలయ్యాయి. తాజాగా ఒక మాజీ మోడల్ ట్రంప్ తనను  ఎలా వేధించాడో బ్రిటిష్ డైలీ ది గార్డియన్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

' కొన్నేళ్ల కిందట ఒక టెన్నిస్ మ్యాచ్ కు ప్రముఖ వ్యాపార వేత్త హోదా లో  ట్రంప్ వచ్చారని..  ఆ సమయంలో ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆ మోడల్ ఆరోపించింది. తన వక్షాలను చేత్తో తాకాడని.. తన పిరుదుల ను తడిమాడని.. తన శరీరం పై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేశాడని ఆమె తెలిపింది. ఎలాగైనా అతడి నుంచి దూరంగా ఉండాలని నెట్టి వేసినప్పటికీ అతడు మరింత రెచ్చిపోయి ప్రవర్తించాడని ఆ మోడల్ విమర్శించింది. ఎన్నికల హంగామా మొదలవడం తో ఆయన వల్ల గతం లో వేధింపులకు గురైన వారు, ఆయనంటే పడని వాళ్ళు ట్రంప్ పై వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. మరోసారి ట్రంప్  వీటన్నింటిని  అధిగమిస్తాడో లేదో చూడాల్సి  ఉంది.
Tags:    

Similar News