కాగ్నిజెంట్ బిగ్ ఎంట్రీ... విశాఖ ఐటీ లెక్క మార్చేస్తోంది !

విశాఖ ఇటీవల కాలంలో చూస్తే ఐటీ పరిశ్రమలు వరసబెట్టి వస్తున్నాయి. దాంతో హైదరాబాద్ బెంగళూరు చెన్నై తో పాటుగా విశాఖ సైతం ఐటీ ఫీల్డ్ లో పోటీ పడుతోంది.;

Update: 2026-01-15 18:30 GMT

విశాఖ ఇటీవల కాలంలో చూస్తే ఐటీ పరిశ్రమలు వరసబెట్టి వస్తున్నాయి. దాంతో హైదరాబాద్ బెంగళూరు చెన్నై తో పాటుగా విశాఖ సైతం ఐటీ ఫీల్డ్ లో పోటీ పడుతోంది. ఇదిలా ఉంటే విశాఖలో తన కార్యకలాపాలను విస్తరించడానికి ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ రంగం సిద్ధం చేసింది. చిత్రమేంటి అంటే ఒక నెల ముందుగానే విశాఖలో ఆపరేషన్స్ స్టార్ట్ చేయడానికి కాగ్నిజెంట్ సిద్ధమైపోవడం. ఇది నిజంగా విశాఖకు గుడ్ న్యూస్ అని చెప్పాల్సిందే.

పెద్ద ఎత్తున స్టాఫ్ తో :

ఇక కొద్ది నెలల క్రితమే కాగ్నిజెంట్ అతి పెద్ద క్యాంపస్ కి శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి నుంచి యాక్టివిటీస్ మొదలవుతాయని అపుడు ప్రకటన వచ్చింది. కానీ దాని కంటే ముందే అంటే జనవరి 26న కాగ్నిజెంట్ తన కార్యకలాపాలను విశాఖలో ప్రారంభిస్తోంది. దాంతో ఏకంగా 800 కి పైగా ఐటీ స్టాఫ్ విశాఖలో పనిచేసేందుకు తరలి వస్తున్నారు. ప్రస్తుతానికి ఒక టెంపరరీ క్యాంపస్ లో తన యాక్టివిటీస్ ని మొదలెట్టనున్న ఈ సంస్థ తన క్యాంపస్ నిర్మాణం పూర్తి అయితే మొత్తంగా అక్కడికి షిఫ్ట్ అవుతుంది అని చెబుతున్నారు.

బీచ్ రోడు కేరాఫ్ ఐటీ :

ఇదిలా ఉంటే భీమిలీ బీచ్ రోడ్ కేరాఫ్ ఐటీగా మారిపోతోంది. ఎన్నో ఐటీ కంపెనీలు అక్కడ తన యాక్టివిటీస్ ని మొదలెడుతున్నాయి. వాటికి అవసరం అయిన భూమిని ప్రభుత్వం అందిస్తోంది. ఇక గత ఏడాది డిసెంబర్ 12న ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ మంత్రి నారా లోకేష్ కలిసి కాగ్నిజెంట్ సంస్థ పర్మనెంట్ క్యాంపస్ కి శంకుస్థాపన చేశారు. అదే సమయంలో కాగ్నిజెంట్ తొందరలోనే తాము విశాఖ వచ్చేస్తామని చెప్పింది. అలా అక్కడ ఐటీ హిల్ లోని ఒక బ్లాక్ ని తీసుకుంది. ఇపుడు అక్కడే జనవరి 26న మొత్తం తన వందల మంది సిబ్బందితో కలసి ఆపరేషన్స్ స్టార్ట్ చేయనుంది.

విశాఖ వారే ప్రయారిటీ :

ఇదిలా ఉంటే విశాఖ నుంచి అలాగే ఉత్తరాంధ్ర నుంచి కాగ్నిజెంట్ సంస్థలో పనిచేస్తున్న వారు అంతా ఇపుడు హ్యాపీగా విశాఖకు షిఫ్ట్ అవుతున్నారు. వీరంతా వివిధ రాష్ట్రాలలో పనిచేస్తూ సొంత ప్రాంతానికి దూరంగా గడుపుతున్నారు. ఇపుడు కాగ్నిజెంట్ విశాఖలోనే తన క్యాంపస్ ని ఓపెన్ చేయడంతో వారంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరో వైపు చూస్తే ఈ మొత్తం 800 మంది ఐటీ స్టాఫ్ లో అయిదు వందల మంది దాకా విశాఖ ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన సిబ్బంది ఉంటారు అని అంటున్నారు. ఇక మిగిలిన వారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు అని తెలుస్తోంది.

క్యాంపస్ రెడీ అయితే :

ప్రస్తుతానికి వేయి లోపు సిబ్బంది కాగ్నిజెంట్ లో టెంపరరీ గా పనిచేయవచ్చు కానీ కాపులుప్పాడలో 22 ఎకరాలలో నిర్మిస్తున్న పర్మనెంట్ క్యాంపస్ రెడీ అయితే ఏకంగా 8 వేల మంది దాకా ఐటీ సిబ్బందికి ఇక్కడే ఉపాధి లభిస్తుంది అని చెబుతున్నారు. ఇలా విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలలో ఐటీ ఫీల్డ్ లో ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది అని అంటున్నారు. అంతే కాదు ఏపీలో ఇతర జిల్లాల వారికి కూడా ఇక్కడ జాబ్ ఆపర్ట్యూనిటీస్ దక్కుతాయని అంటున్నారు. ఇది మంచి పరిణామంగా అంతా చూస్తున్నారు. రానున్న రోజులలో ఈ నంబర్ కూడా ఏ ముప్పయి వేల మంది ఐటీ స్టాఫ్ కి ఉపాధి ఇచ్చేదాక ఎదిగేందుకు వీలు ఉంటుందని అంటున్నారు. కేవలం కాగ్నిజెంట్ మాత్రమే కాదు ఇతర ఐటీ సంస్థలు కూడా క్యూలో ఉన్నాయి అన్నీ కలిస్తే విశాఖలోనే పెద్ద ఎత్తున వేలల్లో ఐటీ ఉద్యోగులు పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు.

Tags:    

Similar News