టిక్‌టాక్‌ పై ట్రంప్‌ డెట్‌ లైన్ .. ట్రంప్ నిర్ణయాన్ని తిప్పి కొట్టిన టిక్ టాక్ !

Update: 2020-09-13 07:00 GMT
భారత్ ప్రభుత్వం గాల్వానా ఘటన తర్వాత , చైనా దేశంలో డిజిటల్ స్ట్రైక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటికే దాదాపుగా 200కి పైగా చైనా యాప్స్ ను వివిధ కారణాలతో ఇండియాలో నిషేదించింది. అందులో ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలేస్తున్న టిక్ టాక్ కూడా ఉంది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై ప్రశంసలు కురిపించిన పలు దేశాలు .. చైనా యాప్స్ పై బ్యాన్ విధిస్తున్నాయి. ముఖ్యంగా చాలా దేశాలు టిక్ టాక్ ను టార్గెట్ చేస్తున్నాయి. అమెరికా కూడా టిక్ టాక్ కి గడువు ఇచ్చింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్ టిక్‌టాక్‌ నిషేధం గడువుపై డెట్‌ లైన్సె జారీ చేశారు. సెప్టెంబరు 15లోపు పూర్తి చేసుకోవాలని, లేదంటే నిషేధమేనని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఒకసారి గడువు డెడ్ లైన్ పెంచిన ట్రంప్ ఇకపై ఈ గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టిక్‌టాక్‌ను ఒక అమెరికన్ కంపెనికి విక్రయిస్తారా, లేదా మూసివేస్తారా తేల్చుకోవాలని ట్రంప్ గురువారం ప్రకటించారు. అమెరికా కంపెనీ యాజమాన్యంలోని లేని టిక్‌టాక్‌ను భద్రతా కారణాల దృష్ట్యా నిషేధిస్తామని ట్రంప్ వెల్లడించారు.

అయితే, అమెరికాలో టిక్‌ టాక్‌ కార్యకలాపాలను అమెరికా కంపెనీలకి అమ్మడం కంటే మూసేయడమే మేలనుకుంటోంది దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్. అమెరికాలో టిక్ ‌టాక్ కార్యకలాపాలపై ఆ సంస్థ ఈ నెల 15లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ట్రంప్‌ బెదిరింపులకు భయపడి టిక్‌ టాక్‌ ను అమ్మితే అమెరికా ఒత్తిడికి తలొగ్గినట్లవుతుందని చైనా అనుకుంటుంది. అందుకే టిక్ ‌టాక్ ‌ను అమ్మడం కంటే మూసేయడమే మేలని ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తుంది. అయితే చైనా ప్రభుత్వం తమకు ఎలాంటి సూచనలు ఇవ్వలేదని బైట్‌డ్యాన్స్ వెల్లడించింది.
Tags:    

Similar News