చైనా సంస్ధలపై నిషేధం విధించిన ట్రంప్..అమెరికాలో సంచలనం
అందరు అనుమానిస్తున్నట్లే అవుట్ గోయింగ్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానాన్ని కంపు చేసేస్తున్నారు. చైనాకు చెందిన 31 కంపెనీల్లో అమెరికన్ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఎవరు పెట్టుబడులు పెట్టకూడదంటూ ట్రంపు ఉత్తర్వులు జారీచేశారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై గురువారం ట్రంప్ సంతకం పెట్టారు. కరోనా వైరస్ నేపధ్యంలో చైనాపై తనకున్న కోపాన్ని ట్రంప్ అద్యక్షునిగా దిగిపోయేంతలోగా ఏదో ఓ పద్దతిలో తీర్చేసుకుంటారని అందరు అనుమానిస్తున్నదే. ఇపుడు అందరి అనుమానాలకు తగ్గట్లే చైనా కంపెనీల్లో పెట్టుబడులను నిషేధించాలని తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.
అమెరికా అభివృద్దిని చైనా కరోనా వైరస్ రూపంలో దెబ్బతీసిందంటూ ట్రంప్ అనేక సందర్భాల్లో బహిరంగంగానే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచ ఆరోగ్యం సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ)ని అడ్డం పెట్టుకుని చైనా యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ రూపంలో దెబ్బ తీసిందనే ఆరోపణలతో ప్రపంచ ఆరోగ్య సంస్ధకు ఇస్తున్న సుమారు 400 మిలియన్ డాలర్ల ఫండును కూడా గతంలోనే ట్రంప్ నిలిపేశారు. చైనాలో పనిచేస్తున్న అమెరికన్ కంపెనీలను వాపసు వచ్చేయమని పిలుపిచ్చారు.
ట్రంప్ ఆదేశాలతో షాంఘై, బీజింగ్, వూహాన్ లాంటి నగరాల్లో పనిచేస్తున్న అమెరికన్ కంపెనీలన్నీ తమ వ్యాపారాలను నిలిపేశాయి. అంతే కాకుండా తమ కార్యాలయాలను చైనాల్లో ఎత్తేసి జపాన్, ఇండియా, వియత్నాం లాంటి దేశాలకు తరలించే ప్రక్రియను ప్రారంభించాయి. ఇపుడు ఏకంగా చైనా కంపెనీల్లో పెట్టుబడులని నిషేధించటమంటే మామూలు విషయం కాదు. ట్రంప్ వాదనేమిటంటే అమెరికా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పెట్టిన కంపెనీల్లో చైనా ఆర్మీ కూడా పెట్టుబడులు పెట్టాయట.
కొన్ని కంపెనీల్లో చైనా ఆర్మీ పెట్టుబడులు పెట్టటమే కాకుండా చైనా ఆర్మీనే నియంత్రిస్తున్న కంపెనీలు కూడా మరికొన్ని ఉన్నాయంటున్నారు. అంటే ఏ రూపంలో చూసుకున్నా సదరు కంపెనీల్లో చైనా ప్రమేయం ఉంది కాబట్టి అటువంటి కంపెనీలకు అమెరికా దూరంగా ఉండటమే మంచిదన్నది ట్రంప్ వాదన. అమెరికా తాజాగా నిషేధించిన కంపెనీల్లో ప్రముఖ మొబైల్ కంపెనీ హువావే, చైనా టెలికాం లాంటి కంపెనీలున్నాయి. మొత్తానికి అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ అమెరికా విదేశాంగ విధానంపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయాలపై ఏకంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేయటం సంచలనంగా మారింది.