పేస్ బుక్ జైలులో ట్రంప్ అకౌంట్ !
అమెరికా అధ్యక్ష పీఠం నుంచి దిగిన డొనాల్డ్ ట్రంప్ కి , ఆ తర్వాత వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రాజధాని వాషింగ్టన్ లోని క్యాపిటల్ బిల్డింగ్ పై జరిగిన హింసాత్మక దాడులకు ట్రంప్ మద్ధతివ్వడమే కాకుండా తన ట్వీట్స్ ద్వారా హింసను ప్రేరేపించాడనే కారణంగా ఆయన ఖాతాను శాశ్వతంగా బ్యాన్ చేయాలని ట్విట్టర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇదేదారిలో ఫేస్ బుక్ , ఇన్ స్టా గ్రామ్ , యూట్యూబ్ స్నాప్ చాట్, ట్విచ్, స్పాటిఫై, షాపిఫై వంటి సంస్థలు ట్రంప్ అకౌంట్పై నిషేధం విధిస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి. కొత్త ప్రెసిడెంట్ గా ఎన్నికైన జో బైడెన్ ప్రమాణ స్వీకారం తదితర సమయాల్లోనూ ఆన్లైన్ ద్వారా ట్రంప్ మరోసారి నిరసనలను ప్రోత్సహించే అవకాశం ఉండటంతో ఫేస్ బుక్ తొలుత జనవరి 20 వరకు ట్రంప్ అకౌంట్పై నిషేధం విధించింది. అయితే, అనూహ్యంగా ఫేస్ బుక్ కూడా ట్విట్టర్ తరహాలోనే శాశ్వతంగా ఆయన అకౌంట్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
అయితే , ట్రంప్ సోషల్ మీడియాను మాత్రం తెగ మిస్ అవుతున్నట్టు ఆయన ఫీలవుతున్నారనుకుంటా. అందుకే అప్పుడప్పుడు నెట్టింట ప్రత్యక్షమవడానికి, నెటిజన్ల రియాక్షన్లు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తనకు ఎలాగో ఫేస్ బుక్ ఖాతా లేదు, నిషేధించారు కాబట్టి ట్రంప్ రూటు మార్చారు. తన కుమారుడు ఎరిక్ ట్రంప్ భార్య అయిన లారా ట్రంప్ ఫేస్ బుక్ ఖాతాను ట్రంప్ దుర్వినియోగం చేసేందుకు యత్నించారు. ఆమె ఖాతాలో ట్రంప్ ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ వీడియో పోస్ట్ ఒకటి సడన్ గా కొన్ని రోజుల క్రితం ప్రత్యక్షమయింది. అంతే, వెంటనే ఫేస్ బుక్ యాజమాన్యం రియాక్టయింది. మీరు పోస్ట్ చేసిన కంటెంట్ ను మేము తొలగించాం. డోనాల్డ్ ట్రంప్ నకు సంబంధించిన వీడియో పోస్టులు మళ్లీ మీ ఖాతాలో పోస్టు చేసినట్టయితే చర్యలు తీసుకోక తప్పదు. మా రూల్స్ ను పాటించకపోతే మీ ఖాతాను రద్దు చేయకతప్పదు అనే అర్థంలో ఓ ఈమెయిల్ ను కూడా ఆమెకు పంపారు. కాగా, ఎన్నికల ఫలితాల అనంతరం ట్రంప్ చేసిన నిర్వాకాలకు సోషల్ మీడియానే ట్రంప్ ను బ్యాన్ చేసింది. క్యాపిటల్ భవన్ పైకి తన అనుచరులను దాడి చేసేలా ప్రోత్సహించేందుకు సామాజిక మాధ్యమాలనే ట్రంప్ వాడుకున్నారు. అయితే ,తాజాగా పేస్ బుక్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మాజీ అధినేత డోనాల్డ్ ట్రంప్ అకౌంట్ ను పేస్ బుక్ రెండేళ్ల పాటు సస్పెండ్ చేసింది. 2023 వరకు ట్రంప్ ఖాతాని తమ జైలులో ఉంచుతున్నట్టు పేస్ బుక్ ప్రకటించింది. నిషేధం ముగిసిన తర్వాత నిపుణుల కమిటీ భేటీ అయ్యి ట్రంప్ అకౌంట్ ను తిరిగి ఓపెన్ చేయడం పై నిర్ణయం తీసుకుంటామని పేస్ బుక్ తెలిపింది.