పెండింగ్ లో ఉన్న నేరెడ్ మెట్ ఫలితం వచ్చేసింది

Update: 2020-12-09 05:55 GMT
ఇటీవల ముగిసిన గ్రేటర్ ఎన్నికల్లో నేరెడ్ మెట్ డివిజన్ ఫలితాన్ని నిలిపివేయటం తెలిసిందే. సాంకేతిక అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం కావటంతో.. ఆ ఫలితాన్ని వెల్లడించలేదు. ఈ రోజు ఉదయం ఓట్ల లెక్కింపు షురూ చేశారు. తాజాగా ఓట్ల లెక్కింపు పూర్తిచేసి.. టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటించారు. దీంతో.. ఇప్పటివరకు గ్రేటర్ లో టీఆర్ఎస్ కు ఉన్న 55 స్థానాలకు అదనంగా మరో డివిజన్ చేరటంతో.. ఆ పార్టీకి 56 డివిజన్లను సొంతం చేసుకున్నట్లైంది.

పోలింగ్ సందర్భంగా స్వస్తిక్ గుర్తు కాకుండా.. పోలింగ్ బూత్ నెంబరు ఉన్న ముద్రను పొరపాటున ఓటర్లకు పోలింగ్ సిబ్బంది ఇవ్వటం.. దీనిపై అభ్యంతరాలువ్యక్తం కావటంతో  ఓట్ల లెక్కింపును నిలిపివేశారు. ఈ అంశంపై తాజాగా హైకోర్టు సూచనల మేరకు .. ఎన్నికల సంఘం చెప్పిన అంశాల ఆధారంగా ఈ రోజు ఓట్ల లెక్కింపు చేశారు. ఈ నెల నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డికి 504 ఓఎట్ల మెజార్టీలో ఉన్నారు.

అదే సమయంలో స్వస్తిక్ ముద్రతో కాకుండా వేరే ముద్రలతో ఉన్న 544 ఓట్లు ఉన్నాయి. ఇతర ముద్రతో ఉన్న ఓట్లు మెజార్టీ కంటే ఎక్కువగా ఉండటంతో ఆ ఫలితాన్ని వెల్లడించలేదు. తాజాగా ఇతర ముద్రలతో ఉన్న ఓట్లను కూడా లెక్కలోకి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. దీంతో.. ఈ రోజు (బుధవారం) ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఓట్లలో కూడా టీఆర్ఎస్ కు అధిక్యత రావటంతో బీజేపీ అభ్యర్థిపై టీఆర్ఎస్ అభ్యర్థి 782 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు.
Tags:    

Similar News