ఈ సార్లూ స‌ర్దుకోవాల్సిందే.. వైసీపీ టాక్‌.. !

కాబట్టి ఇప్పుడు వీరు గెలవరు, లేకపోతే ప్రజల్లో అంత సింపతీ లేదు అని భావిస్తే అటువంటి వారు ఏ మేరకు సర్దుకుపోతారు అనేది కూడా చూడాలి.;

Update: 2026-04-28 02:45 GMT

రాజకీయంగా బలమైన నాయకత్వానికి ఏ పార్టీ అయినా ప్రాధాన్యమిస్తుంది. ఏమాత్రం గ్రాఫ్ తగ్గుతోందని భావించినా అటువంటి నాయకులను పక్కన పెడుతుంది. సహజంగా ఇది రాజకీయాల్లో అనుసరించే విధానం. ఇట్లాంటి జాబితాలో వైసిపి నాయకులు కొంతమంది ఉన్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కొంతమంది నాయకులను పక్కన పెడతారని పార్టీ పరంగా వారికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుందని సీనియర్ నాయకులు చెబుతున్నారు.

వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వైసిపి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జగన్ పాదయాత్ర కూడా ఈ క్రమంలోనే చేపట్టమన్నారు. ఇప్పటికే ఐదు సంవత్సరాలు అధికారం తర్వాత మళ్లీ 30 సంవత్సరాల వరకు అధికారంలో ఉంటామని ప్రకటించినప్పటికీ గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు గెలుపు గుర్రాలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని మిగిలిన వారిని పార్టీకి ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.

వారిని పార్టీ తరఫున వాయిస్ వినిపించేలా చూడాలని లెక్కలు వేసుకున్నారు. ఇటువంటి వారిలో బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అదే విధంగా నగరి మాజీ ఎమ్మెల్యే రోజా పేరు కూడా ఈ జాబితాలో ఉందని తెలుస్తోంది. అయితే వీరు ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో గెలుపు గుర్రాలుగా పార్టీ భావించిన చాలామంది గత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.

కాబట్టి ఇప్పుడు వీరు గెలవరు, లేకపోతే ప్రజల్లో అంత సింపతీ లేదు అని భావిస్తే అటువంటి వారు ఏ మేరకు సర్దుకుపోతారు అనేది కూడా చూడాలి. ఏదేమైనా ఈ విషయం పార్టీలో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ జాబితాలో కారుమూరి నాగేశ్వ‌ర‌రావు, బూడి ముత్యాల నాయుడు, తిప్ప‌ల నాగిరెడ్డి, ద్వార‌కా నాథ్ రెడ్డి వంటి ప‌లువురు ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. వీరికి పార్టీ ప‌రంగా ప‌ద‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. వీరి నుంచి అభిప్రాయం తీసుకుంటారా? లేదా? అనేది కూడా చూడాలి.

Tags:    

Similar News