పొలిటిక‌ల్ జ‌ర్నీపై క‌విత కీల‌క ప్ర‌క‌ట‌న‌

Update: 2018-09-04 10:51 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్  త‌న‌య‌ - టీఆర్ ఎస్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత అనూహ్య క్లారిటీ ఇచ్చారు. సుదీర్ఘ‌కాలంగా జ‌రుగుతున్న త‌న కేంద్రంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌కు చెక్ పెట్టారు. చాలా కాలంగా 2019 ఎన్నికల్లో కవిత స్థానంపై ప్రజల్లో ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా పోటీచేస్తారా? లేదా మళ్లీ ఎంపీగానే పోటీచేస్తారా? అని రాజ‌కీయవ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుండ‌గా...పార్టీ శ్రేణులు సైతం ఇదే అంశంపై ఆరాతీస్తున్నాయి. ఈ  మేర‌కు ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పేర్కొంటూ విశ్లేష‌ణ‌లు సైతం జ‌రిగాయి. జ‌గిత్యాల నుంచి పోటీ చేస్తార‌ని కొంద‌రు పేర్కొంటుండ‌గా...వేముల‌వాడ నుంచి రంగంలో నిలుస్తార‌ని ఇంకొంద‌రు విశ్లేషించారు. అయితే, జ‌గిత్యాల పైనే ఎక్కువ ఫోక‌స్ జ‌రిగింది. తాజాగా ఆమె మ‌రో అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు.

కొద్దికాలంగా త‌న పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని జ‌గిత్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీ క‌విత‌ త‌ర‌చుగా ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అక్క‌డి నుంచి క‌విత‌ పోటీ చేయ‌నున్న‌ట్లు జోస్యాలు వెలువ‌డ్డాయి. ఈ ఏడాది జ‌రిగిన ప్లీన‌రీలో క‌విత స్పందిస్తూ  జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీచేస్తాన‌నే అంశం త‌న‌ చేతిలో లేదని ఎంపీ క‌విత క్లారిటీ ఇచ్చారు. త‌మ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలపై ఆధారపడి ఉంటుంద‌ని వివ‌రించారు. దీనికి కొన‌సాగింపుగా తాజాగా జ‌గిత్యాల జిల్లాలో ప‌ర్య‌టిస్తూ జ‌గిత్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పార్టీ నేత డాక్ట‌ర్ సంజ‌య్ బ‌రిలో దిగ‌నున్నార‌ని తెలిపారు. త‌ద్వారా తాను పోటీ చేయ‌బోన‌ని తెలిపారు. అదే స‌మ‌యంలో టీఆర్ ఎస్ త‌రఫున మొట్ట‌మొద‌టి అభ్య‌ర్థిని ఆమె ప్ర‌క‌టించారు.

గులాబీద‌ళ‌ప‌తి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశ రాజకీయాల వైపు చూస్తుంటే...తర్వాత రాష్ట్ర రాజకీయాలను అంతలా ప్రభావితం చేయగలవారు ఎవరు అనే చర్చ తెర‌మీద‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ స్థానాన్ని కేటీఆర్? లేదా కవిత భర్తీ చేస్తారా? అనే విషయంపై ఆస‌క్తి నెలకొంది. అయితే ఈ విషయంపై కొద్దికాలం కింద‌ట ఎంపీ క‌విత స్పందిస్తూ త‌న అన్న సార‌థ్యంలోనే తాను ముందుకు సాగుతాన‌ని వెల్ల‌డించారు. త‌ద్వారా కేటీఆర్‌-హ‌రీశ్‌రావుల మ‌ధ్య సాగుతున్న వార‌స‌త్వ పోరుకు సైతం ఆమె చెక్ పెట్టారు. తాజాగా త‌న కేంద్రంగా జ‌రుగుతున్న ఎమ్మెల్యే సీటు చ‌ర్చ‌కు సైతం తెర‌దించారు.

Tags:    

Similar News