సీబీఐ నోటీసులకు కల్వకుంట్ల కవిత ప్రతిస్పందన ఇదే

Update: 2022-12-03 16:46 GMT
ఢిల్లీ లిక్కర్ స్కాంను ఎలా ఎదుర్కోవాలనే దానిపై తండ్రి, సీఎం కేసీఆర్ ను కలిసి చర్చలు జరిపిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. సీబీఐ నుంచి నోటీసు అందగానే హైదరాబాద్ లోని తమ ఇంట్లో విచారణకు సిద్ధమని ఆమె ప్రకటించారు. సీబీఐకి కవిత లేఖ రాశారు. ఎఫ్ఐఆర్ తోపాటు ఫిర్యాదు కాపీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే సంబంధిత అనుబంద కాపీలను ఇవ్వాలన్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీబీఐకి కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఫిర్యాదు కాపీతోపాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా సంబంధిత కాపీలను అందించాలని పేర్కొన్నారు.

సీబీఐ నోటీసు అందిందని స్వయంగా కవితనే ప్రకటించారు. శనివారం ఉదయం ప్రగతి భవన్ కు వెళ్లి తన తండ్రి, సీఎం కేసీఆర్ తో తనకు వచ్చిన నోటీసులపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయనిపుణులతోనూ కేసీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలోనూ ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ డీటైల్స్ కాపీలు తీసుకోవాలని లేఖ రాయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు కవిత లేఖ రాశారు. సమాచారాన్ని మీడియాకు ఇచ్చారు.

కవిత లేఖ ప్రకారం వివరణ కోసం వచ్చినప్పుడు ఫిర్యాదు కాపీలు, ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకువస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు అవి ఇవ్వకపోతే విచారణకు హాజరయ్యేందుకు తన తరుఫున క్లారిఫికేషన్ ఇచ్చేందుకు నిరాకరించే అవకాశం ఉంది. ఈ వ్యూహంతోనే ఎఫ్ఐఆర్ కాపీలు అడిగినట్లుగా తెలుస్తోంది. ఆ వ్యూహమే అమలు చేస్తుందో లేదో 6వ తేదీన కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
Tags:    

Similar News