అధికారికి టీఆర్ ఎస్ ఎమ్మెల్యే బెదిరింపు

Update: 2017-12-11 03:30 GMT
తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే బెదిరింపు ప‌ర్వం మ‌రోమారు తెర‌మీద‌కు వ‌చ్చింది. టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యే వీరేశం రెచ్చిపోయి. ఒక ఉద్యోగి కోసం నల్గొండ డీసీసీబీ సీఈవోను ఫోన్‌ లో చెడామడా తిడుతూ బెదిరించసాగాడు. అంతేకాదు సోమవారం లోపు తాను చెప్పిన పని చేయకపోతే...నీ సంగతి చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చి. పైగా పది లక్షలు డిమాండ్ చేశారని సిఎంకు - పై అధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ సీఈవోకు హడలెత్తించాడు.

నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డీజీఎం లక్ష్మమ్మ నిధుల దుర్వినియోగం కేసులో ఇటీవల సస్పెండ్ అయ్యారు. ఆమెకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలంటూ సీఈవో మదన్మోహన్‌ ను ఎమ్మెల్యే వీరేశం కోరారు. దీనికి సీఈవో అంగీకరించలేదు. అయినా ఆ విషయం తన పరిధిలో లేదంటూ దీనిపై డీసీసీబీ చైర్మన్‌ తో చర్చిస్తానంటూ పేర్కొనడంతో ‘నా మాటకే ఎదురు చెప్తావా... ఆంధ్రా అధికారివి’ అంటూ నోరు జారారు. ఇలా ఎమ్మెల్యే బెదిరింపుల ఆడియో కాస్త ఆదివారం లీకైంది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అయితే దీనిపై  ఎమ్మెల్యే వేముల వీరేశం స్పందిస్తూ వికలాంగురాలికి పోస్టింగ్ ఇవ్వకుండా...ఏడీసీసీ బ్యాంకు సీఈవో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అందులో భాగంగానే సీఈఓ పై మండిపడ్డానని చెప్పారు. సస్పెండ్ అయ్యానన్న మనస్తాపంతో బాధితరాలు ఆత్మహత్య చేసుకుంటానని చెబుతోందని, ఓ ప్రాణం పోకోడదనే ఉద్దేశంతోనే అధికారితో తాను పరుషంగా మాట్లాడాల్సి వచ్చిందని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. చినిపోతానంటున్న వ్యక్తికి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే సదరు అధికారితో ఆ విధంగా మాట్లాడానని, అక్కడ మాట జారవచ్చు.. కానీ ఇక్కడ ఒక ప్రాణం పోతుంది..., జారిన మాట కంటే ఇక్కడ వికలాంగురాలు ప్రాణమే తనకు కళ్లముందు కనిపిస్తుందని వీరేశం అన్నారు. సీఈవో గతంలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు.

Full View
Tags:    

Similar News