మునుగోడులో బీజేపీ గెలిస్తే.. నేను రాజీనామా చేస్తా.. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే శ‌ప‌థం

Update: 2022-10-28 02:30 GMT
మునుగోడు ఉపఎన్నిక రాజ‌కీయంగా మ‌రింత కాక పుట్టిస్తోంది. ఇక్క‌డ ఇప్ప‌టికే.. హాట్ హాట్ కామెంట్లు.. నేత‌ల హామీల‌తో పాటు ఒక‌రిపై ఒక‌రు చేసుకుంటున్న విమ‌ర్శ‌ల‌తో మునుగోడు.. సార్వత్రిక స‌మ‌రాన్ని త‌ల‌పిస్తోంది. పైగా.. డ‌బ్బుల క‌ట్ట‌లు కూడా. బ‌య‌ట ప‌డుతుండ‌డం.. ఒక‌రిని మించి మ‌రొక‌రు అన్న విధంగా.. పార్టీలు డ‌బ్బుల సంచులు ఎర‌వేస్తుండ‌డం కూడా మునుగోడు పోరును ర‌స‌వ‌త్త‌రం చేసింది. ఇక‌, ఈ క్ర‌మంలో తాజాగా.. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ఒక‌రు భీష‌ణ ప్ర‌తిజ్ఞ చేశారు.

మునుగోడు ఉప పోరులో .. బీజేపీ గెలిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బోధన్ నియోజ‌క‌వ‌ర్గం టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యే షకీల్ సవాల్ చేశారు. మన ఊరు- మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాలేశ్వర్లో పర్యటించిన ఆయన.. మునుగోడు ఉపఎన్నిక లో బీజేపీ అభ్య‌ర్థి.. రాజగోపాల్రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని జోస్యం చెప్పారు. అంతేకాదు.. ఆయ‌న కాంగ్రెస్‌ను మోసం చేసిన‌ట్టుగానే.. ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాడ‌ని.. అందుకే.. అలివి మీరిన హామీలు ఇస్తున్నాడ‌ని అన్నారు.

ఈ క్ర‌మంలో మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలిస్తే.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే షకీల్ సవాల్ చేశారు.  మునుగోడులో టీఆర్ ఎస్‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ ఎస్‌ సర్కార్ను కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించిన ఎమ్మెల్యే.. బీజేపీ అక్రమంగా సంపాదించిన డబ్బులతో తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. తమ ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీకి అమ్ముడుపోరని ధీమా వ్యక్తం చేశారు.

``టీఆర్ ఎస్‌లో ఎలా అయినా చిచ్చుపెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ చూస్తోంది. బీజేపీ దగ్గర వందలు, వేల కోట్లు ఉన్నాయి. మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలో ఎలా అయితే ప్రభుత్వాలను పడగొట్టిందో.. అలానే ఇక్కడ కూడా బీజేపీ ప్రయత్నిస్తోంది. టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరవేసి ఎమ్మెల్యేలను కొనాలని చూస్తోంది.

మునుగోడులో కూసుకుంట్ల‌ విజయం ఖాయం.. మునుగోడులో బీజేపీ గెలిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మునుగోడులో రాజ‌గోపాల్‌కు డిపాజిట్లు కూడా రావు`` అని ష‌కీల్ వ్యాఖ్యానించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News