ఇండియా-ఈయూ ట్రేడ్ డీల్.. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్
ఇండియా-యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతినుద్దేశించి మాట్లాడారు.;
ఇండియా-యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్యం ఒప్పందం కుదిరితే.. భారత ఉత్పత్తి రంగానికి ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అదే సమయంలో సేవల రంగం కూడా విస్తరిస్తుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ఇండియాలో పెట్టుబడులు పెట్టాలనుకునే పెట్టుబడిదారుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ఇండియా-యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతినుద్దేశించి మాట్లాడారు.
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్
ట్రంప్ వాణిజ్యం ఆంక్షల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్, ఇండియా మధ్య వాణజ్య ఒప్పందానికి అడుగులు పడ్డాయి. వాణిజ్య ఒప్పందం ద్వారా అటు ఇండియా, ఇటు యూరోపియన్ యూనియన్ దేశాలు భారీ ఎత్తున లబ్ధి పొందుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా దీనిని అభివర్ణిస్తున్నారు. ఈ ఒప్పందంతో యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి దిగుమతి చేసుకునే లగ్జరీ కార్ల ధరలు భారీగా తగ్గుతాయని భావిస్తున్నారు. ట్రేడ్ డీల్ తర్వాత యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై ఉన్న సుంకాలు 110 శాతం నుంచి 40 శాతానికి రానున్నాయి. మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ లాంటి లగ్జరీ కార్ల ధరలు ఇండియన్స్ కు అందుబాటులో ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. చాలా వరకు లగ్జరీ కార్ల ధరలు తగ్గుతాయని ఆశిస్తున్నారు.
అమెరికా ఆగ్రహం
ఇండియా-యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పైన అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా నుంచి భారత్ కొనగోలు చేసి, శుద్ధి చేసిన చమురును యూరోపియన్ యూనియన్ దేశాలు కొనుగోలు చేయడం, ఉక్రెయిన్ పై రష్యాను ఎగదోయడమే అని వ్యాఖ్యానించింది. రష్యా యుద్ధానికి పరోక్షంగా నిధులు అందించిన వారవుతారంటూ అమెరికా ప్రతినిధులు ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్ పై స్పందించారు. అమెరికా ఎటు వెళ్లినా.. మళ్లీ రష్యా చమురు కొనుగోలు అంశం వద్దకే రావడం అమెరికా వైఖరిని తేటతెల్లం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రష్యా తమ మాట వినలేదనే అక్కసుతో ప్రపంచ దేశాలను రష్యాతో వ్యాపారం చేయొద్దని ఒత్తిడి చేయడం అమెరికా వైఖరి ఏంటో చెబుతోంది. తనకు ఇష్టం లేనిది ఎవరూ తినొద్దు అన్నట్టు అమెరికా వైఖరి ఉంది. ప్రపంచ దేశాలన్నీ తన మాట వినాలనే పెద్దన్న ధోరణి ప్రదర్శిస్తూ, మాట వినకపోతే టారిఫ్ ల ద్వారా కర్రపెత్తనం చెలాయిస్తోంది.
వాట్ నెక్ట్స్ ?
ట్రంప్ ఆంక్షలు విధించడం భారత్ కు పరోక్షంగా మేలు చేసింది. ఎందుకంటే ఒకదేశ మార్కెట్ పై ఆధారపడటం ద్వారా భవిష్యత్తులో ముప్పు ఎదురువుతుంది. ఆ దేశం భారత ఎగుమతులు కొనుగోలు చేయకపోతే ఇబ్బందులు తప్పవు. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా దేశీయ ఉత్పత్తులకు మార్కెట్ ను విస్తరించుకోవడం ద్వారా రిస్క్ తగ్గించుకోవచ్చు. అమెరికా కాకపోతే యూరప్ అన్నట్టు వ్యవహరించకపోతే ట్రంప్ లాంటి వాళ్ల నుంచి ఇబ్బందులు తప్పవు. ఇది గుణపాఠం. ఇది తాత్కాలిక ఒత్తిడికి కారణమైన దీర్ఘకాలంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని స్పష్టం చేసింది.