ఢిల్లీ, సిల్లీ.. బీజేపీతో పొత్తు ఉండదనే గ్యారెంటీ ఉందా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. మాటల మాంత్రికుడుగా పేరుంది. నందిని పందిని చేయగల దిట్ట. అదేసమయంలో పందిని నందిగా భ్రమింపజేసి.. పూజలు కూడా చేయించేయడంలో ఆయనను మించిన నాయకుడు లేరని అంటారు.
రాజకీయ అవసరాలు.. అవకాశాలే.. ఆయనకు పరమావధి అని ఆయన గురించి బాగా తెలిసిన వారు తరచుగా చెబుతుంటారు. ఇప్పుడు ఇలాంటి వాదనే ఒకటి తెలంగాణ మేధావి వర్గాల మధ్య జరుగుతోంది. అదేంటంటే.. ఇటీవల కేసీఆర్.. జాతీయ పార్టీ.. బీజేపీపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీని, రాష్ట్రంలోని బీజేపిని కూడా ఆయన ఏకేశారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత.. కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. వరి వేయొద్దని.. కేంద్రంలోని బీజేపీ పాలకులు చెప్పారనే.. రాష్ట్రంలో తాము వరి వేయవద్దని.. రైతులను రిక్వెస్ట్ చేశామని అన్నారు. అంతటితో ఆగకుండా.. ``అక్కడ కేంద్రంలోని బీజేపీ నేతలు.. వరి వేయొద్దంటరు.. కానీ, ఇక్కడ రాష్ట్రం లో బీజేపీ నేతలు.. మాత్రం.. వరి వేయాలంటరు.. మరి ఆ ఢిల్లీ బీజేపీ చెప్పింది ఇనాల్నా.. ఈ సిల్లీ బీజేపీ చెప్పింది చేయాల్నా?`` అని ఘాటుగానే ప్రశ్నించారు. ఇక, ఈ రెండు పార్టీల మధ్య యుద్ధం ఓ అసాధారణమైన రేంజ్‌లో జరిగిన విషయం తెలిసిందే.
అయితే.. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. కేసీఆర్ చెప్పినట్టు.. ఢిల్లీ బీజేపీ.. సిల్లీ బీజేపీ అనే మాటలు సోషల్ మీడియాలో టైటిళ్లకు, స్క్రోలింగులకు బాగానే ఉంటాయి. కానీ, ఇక, కేసీఆర్.. బీజేపీ స్థాయిని తేల్చేశారు కాబట్టి.. ఇక, ఆ పార్టీతో ఆయన పొత్తుకు దూరంగా ఉంటారా? ఉంటే గ్యారెంటీ ఏమైనా.. ఉందా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. ఆది నుంచి కూడా కేసీఆర్.. తన వరకు వస్తే.. ఏదైనా.. సరే.. తనకు అనుకూలంగా మార్చుకునేందుకే ప్రయత్నిస్తారు. అది ఎంత పనైనా సరే.! ఉదాహరణకు.. అనేక బిల్లుల్లో.. కేంద్రానికి రాజ్యసభలో మద్దతిచ్చిన పార్టీ టీఆర్ ఎస్.
అంతేకాదు.. ఇప్పుడు ఏదైతే.. మూడు రైతు బిల్లులపై ఢిల్లీలో ధర్నా చేస్తా.. అని ప్రకటించాడో కేసీఆర్.. మరి అంత ప్రేమ రైతులపై ఉన్నప్పుడు.. ఈ ఏడాది ప్రారంభంలో ఒకసారి.. తర్వాత మరోసారి.. ఇదే పంజాబ్ రైతాంగం.. మూడు బిల్లులకు వ్యతిరేకంగా.. బీజేపీ పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. భారత్ బంద్‌కు పిలుపునిచ్చినప్పుడు.. ఏం చేశారు? తొలిసారి కనీసం .. మద్దతు కూడా ప్రకటించలేదు. రెండో సారి విధిలేక.. ఇష్టమైన వాళ్లు చేసుకోండని చెప్పారు. మరి.. ఇప్పుడేమో.. రోడ్డెక్కి.. రచ్చకు లాగుతానని.. బీజేపీని బెదిరిస్తున్నారు.
ఈ ఒక్కటే కాదు.. బీజేపీ విషయంలో కేసీఆర్ అనేక సందర్భాల్లో రెండునాల్కల ధోరణిని ప్రదర్శించారు. మోడీని అప్పుడో ఎప్పుడో.. సోషల్ మీడియాలో ఎవరో ఏదో అంటే.. వాళ్లను ప్రస్‌మీట్ పెట్టి మరీ.. దుయ్యబట్టారు. మరి ఇప్పుడు మాత్రం బీజేపీని ఢిల్లీ, సిల్లీ అని కామెంట్ చేయడం అందరికీ విస్మయాన్ని కలిగిస్తోంది.
నిజానికి ఏదైనా ఉంటే. ఒక స్టాండ్‌పై ఉండాలి. అంతే తప్ప.. అవకాశం వస్తే.. తిట్టడం.. అవసరం కోసం.. మద్దతివ్వడం వంటివి.. సరైనవేనా? అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలోనే మేదావులు.. సైతం.. తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో పస ఎంత? అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీతో ఎప్పటికీ.. దోస్తీ ఉండదని.. కేసీఆర్ స్పష్టం చేయగలరా? అనేది మేధావుల ప్రశ్న.