రచ్చ..రచ్చ.. టీఆర్ఎస్ డబ్బు పంపిణీని అడ్డుకున్న బీజేపీ నేతపై దాడి
గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పటివరకు తూటాల్లా పేలిన మాటల్ని బంద్ చేసి.. తమ శక్తి యుక్తుల్ని చేతల్లో చూపిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్ నేతలు..కార్యకర్తలు పలు చోట్ల ఓట్ల కోసం డబ్బులు పంపిణీ చేస్తున్న వైనాన్ని బీజేపీ నేతలు బట్టబయలు చేశారు. కొన్నిచోట్ల ఈ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతగా మార్చింది. అలాంటి ఒక ఉదంతం మేడ్చల్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి మేడ్చల్ లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారుగా చెబుతున్న కొందరు డబ్బులు పంచుతుంటే.. మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీశ్ రెడ్డి అడ్డుకున్నారని.. దీంతో ఆయనపై దాడి జరిగినట్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
ఈ దాడిలో గాయాలైన హరీశ్ రెడ్డిని ఆసుపత్రిలో చేర్పించినట్లుగా చెప్పారు. తమపై దాడి చేసింది మరెవరో కాదని.. పోలీసులే అంటూ బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు. ఆసుపత్రితో చికిత్స పొందుతున్న హరీశ్ ను.. అర్థరాత్రి పన్నెండు గంటల సమయంలో ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాభిమానం కోల్పోయిన టీఆర్ఎస్ పార్టీ..అడ్డదారిలో గెలవాలని భావిస్తున్నట్లు చెప్పారు. పోలీసు అధికారులే దగ్గరుండి మరి డబ్బుల పంపిణీని చేయటం సిగ్గుచేటన్నారు. ఇలాంటి వాటిని బీజేపీ కార్యకర్తలు ఎక్కడక్కడ అడ్డుకోవాలన్నారు. ఎన్నికల ప్రచారంలో అభివృద్ధే గెలిపిస్తుందని మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శించిన టీఆర్ఎస్ పార్టీ.. తీరా పోలింగ్ కు ముందు నోట్ల కట్టలతో బయలుదేరారని బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు పలువురు డబ్బుల్ని పంచుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నా.. పోలీసులు కేసులు నమోదు చేయకపోవటం దారుణమన్నారు. రాష్ట్ర డీజీపీ ముఖ్యమంత్రి మార్గదర్శనంలో పని చేస్తున్నారంటూ మండిపడ్డారు.