వ్వాట్ జుమ్కా! ఇటలీ మహిళా ప్రధాని ఛమక్కు చూశారా?
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ ఉంది. ముఖ్యంగా మన కట్టు, బొట్టు, వేషధారణకు విదేశీయులు ఫిదా అవుతుంటారు.;
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ ఉంది. ముఖ్యంగా మన కట్టు, బొట్టు, వేషధారణకు విదేశీయులు ఫిదా అవుతుంటారు. భారతీయ సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోయే మహిళల అందానికి దాసోహం కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. చెవులకు జుమ్కాలు.. నుదిటికి పాపిడి బొట్టు, నడుముకు వడ్డానం.. ఇస్టయిల్ ని ప్రపంచం అంతా ఇష్టపడుతుంది. ఇప్పుడు ఆ జాబితాలోకి ఇటలీ దేశ మహిళా ప్రధాని జార్జియా మెలోని కూడా చేరిపోయారు. తాజాగా మెలనీ భారతీయ శైలిలో ఉన్న `జుమ్కాలు` ధరించి దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ప్రపంచ దేశాలను శాసించే ఒక అగ్రనేత ఇలా దేశీ అలంకరణలో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ప్రధాని మెలోని స్వయంగా ఒక సెల్ఫీని షేర్ చేయగా.. నెటిజన్ల దృష్టి తను రాసిన సందేశం కంటే ఆమె చెవులకు ఉన్న ఆభరణాలపైనే ఎక్కువగా పడింది. భారతీయ కళాత్మకతకు ప్రతీకగా నిలిచే ఈ చెవి జుంకాలు ఆమెకు సరికొత్త కళను తెచ్చిపెట్టాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీతో మెలనీకి ఉన్న స్నేహపూర్వక సంబంధం గురించి అందరికీ తెలిసిందే. గతంలో జి20 సదస్సు వేదికపై వారిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు ఈ జుంకాలతో మెలనీ మరోసారి భారతీయుల మనసు గెలుచుకున్నారు.
తాజాగా ఇటలీ ప్రధాని మెలనీ షేర్ చేసిన పోస్ట్‌లో రాజకీయ పరమైన అంశాలు ఉన్నా... భారతీయులు మాత్రం ఆమె చూపిన ఈ `సాంస్కృతిక గౌరవాన్ని` మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. ``మేము ఎవరి మాటలు వినం.. మా దిక్సూచి ఎప్పుడూ ఇటలీ ప్రయోజనాలే`` అంటూ మెలనీ గంభీరమైన సందేశాన్ని రాశారు. కానీ ఆ గంభీరమైన మాటల వెనుక ఒక సున్నితమైన భారతీయ శైలి దాగి ఉండటం విశేషం. గ్లోబల్ లీడర్‌షిప్ .. దేశీ ఎలివేషన్స్ కలయికగా ఉన్న ఈ ఫోటోగ్రాఫ్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఫ్యాషన్ అనేది రెండు సంస్కృతుల మధ్య ఒక బలమైన వారధిగా పనిచేస్తుందని మెలోని నిరూపించారు. ఒక దేశపు సాంప్రదాయ ఆభరణాన్ని ధరించడం ద్వారా.. ఆమె భారత్‌పై తనకున్న గౌరవాన్ని పరోక్షంగా చాటుకున్నారు. నేటి డిజిటల్ యుగంలో నాయకులు కేవలం అధికారిక సమావేశాలకే పరిమితం కాకుండా.. ఇటువంటి చిన్న చిన్న సంజ్ఞల ద్వారా ఇతర దేశాల ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. కేవలం రాజకీయ దౌత్యమే కాకుండా.. ఈ డిజిటల్ వేదికల ద్వారా ఇరు దేశాల మధ్య అనుబంధం మరింత బలపడుతోంది.
ఆ జుంకాలు కేవలం ఒక స్టైల్ స్టేట్‌మెంట్ మాత్రమే కాదు.. అవి సరిహద్దులు దాటిన ఆత్మీయతకు చిహ్నం. ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ అయి ఉన్న నేటి కాలంలో.. హృదయాన్ని టచ్ చేసేలా ఇటువంటి చిన్న చిన్న చేతలు మాటలకంటే ప్రభావవంతంగా పనిచేస్తాయి. మెలోని ధరించిన జుంకాలు ఇప్పుడు ఇటలీకి, ఇండియాకు మధ్య ఉన్న బలమైన దౌత్య నీతికి .. సాంస్కృతిక మార్పిడికి ఒక అందమైన నిదర్శనంగా నిలిచాయి.