మోడీ గురించి బాబు : మంచి టైమింగ్ తో రైమింగ్ తో !
ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీని కొనియాడడం సాధారణమైన విషయమే. ఎందుకంటే ఇద్దరూ ఎన్డీయేలోనే ఉన్నారు.;
ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీని కొనియాడడం సాధారణమైన విషయమే. ఎందుకంటే ఇద్దరూ ఎన్డీయేలోనే ఉన్నారు. ఇద్దరూ ఇపుడు కలిసి పనిచేస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏపీలో కొనసాగుతోంది. ఇక మోడీ చంద్రబాబుని ఈ మధ్యన ఆయన పుట్టిన రోజు సందర్భంగా తనకు అత్యంత ఆప్త మిత్రుడు కష్టించి పనిచేసే నైజం కలవారు అని ప్రశంసించారు. బాబు కూడా దేశానికి మోడీ నాయకత్వం అవసరం అని సమయం వచ్చిన ప్రతీ సారీ చెబుతూనే ఉంటారు.
మోడీ మీద సరికొత్తగా :
ప్రధాని మోడీ గురించి బాబు ముంబై వేదికగా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రశంసలు కురిపించారు. ఆ సందర్భం ఏమిటి అంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ - 2025 అవార్డును ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. ప్రత్యేకించి మోడీ సారథ్యంలో ఈ రోజున దేశం అభివృద్ధి సాధిస్తోంది అని అన్నారు ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ అగ్రస్థాయి దేశంగా మారుతుందన్న ధీమాను కూడా బాబు వ్యక్తం చేశారు. ఇక ఈ క్రమంలోనే ఆయన మోదీని రిఫార్మర్ పెర్ఫార్మర్ విన్నర్ అంటూ ఆకాశానికెత్తేశారు. ఇలా ఇంగ్లీషులో ప్రాసతో కూడిన కితాబులతో బాబు అక్కడున్న అందరినీ మురిపించారు.
అవార్డుతో మరింతగా :
ఇక టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు స్వీకరించడం సంతోషంగా ఉందని బాబు చెప్పారు. ఈ అవార్డు ద్వారా మరిన్ని పెట్టుబడులు ఏపీకి వస్తాయని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ దిశగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నామని బాబు తెలిపారు. అంతే కాదు ఏపీలో అనుమతుల వేగాన్ని పారిశ్రామిక వేత్తలు గుర్తించాలని కోరుతున్నాననని బాబు చెప్పడం విశేషం. అదే విధంగా చూస్తే కనుక వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలు ఉన్నాయని ముంబై వేదికగా జాతీయ స్థాయిలో పెట్టుబడిదారులకు తెలిపారు.
సంస్కరణల పర్వం :
ఇక ఈ రోజున చూస్తే దేశంలో పెద్ద ఎత్తున సంస్కరణలు అమలవుతున్నాయని బాబు గుర్తు చేశారు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని అన్నారు. సరిగ్గా చూస్తే ఇది పెట్టుబడులకు కూడా మెరుగైన సమయం అని బాబు చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానాల ద్వారా ఏపీలో సుపరిపాలన అందిస్తున్నామని బాబు తెలిపారు. అలాగే ఏఐ డాక్టర్ ఎఐ ట్యూటర్ ఏఐ అగ్రానమి లాంటి సేవలు అందిస్తున్నామని జాతీయ స్థాయిలో ఏపీ గురించి గట్టిగా చెప్పారు.