పాక్ లో దాహం దాహం...మోడీ చేసిన పనికి కుదేలు
పాకిస్తాన్ అంటే మొదటి నుంచి భారత పాలకులు చాలా సహనంగా ఉంటూ వచ్చారు. ఎంతైనా గతంలో భారత్ లో అంతర్భాగమని వారు కూడా సోదరులే అని భావించేవారు.;
పాకిస్తాన్ అంటే మొదటి నుంచి భారత పాలకులు చాలా సహనంగా ఉంటూ వచ్చారు. ఎంతైనా గతంలో భారత్ లో అంతర్భాగమని వారు కూడా సోదరులే అని భావించేవారు. అందుకే పాక్ ఉగ్ర భూతాన్ని ప్రోత్సహించి వదిలినా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో రకాలుగా యుద్ధానికి దిగినా భారత్ ని దెబ్బ తీసే పనులు లెక్కలేనన్ని చేసి పొగరుగా తల విదిలించినా పోనీలే అని సర్దుకున్నారు. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక సీన్ మారింది. 2025 ఏప్రిల్ 22న పహిల్గాంలో ఉగ్ర దాడి తరువాత మోడీ తీసుకున్న కఠినమైన నిర్ణయం సింధూ జలాలను పాక్ కి నిలిపివేయాలని. ఇది జరిగి ఏడాదికి దగ్గర అవుతోంది ఇపుడు మండు వేసవిలో పాక్ దాహం అంటూ అల్లాడుతోంది.
పదేళ్ళ క్రితమే ఆలోచన :
నిజానికి చూస్తే 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక 2016లోనే సింధూ జలాలను నిలిపి వేయాలని ఆలోచించారు అని ప్రచారం జరిగింది. అప్పటికే పాక్ రెచ్చిపోయి సరిహద్దుల్లోనూ భారత్ లోపలా ఉగ్రవాదులకు మద్దతు ఇస్తూ వస్తోంది. దాంతో మోడీ సీరియస్ స్టెప్ తీసుకోవాలని అనుకున్నారు. కానీ మిగిలిన మార్గాలలోనే వెళ్ళారు. కానీ 2025 లో జరిగింది మాత్రం దారుణ మారణహోమం. ఏకంగా మతం ఏమిటని అడిగి మరీ చంపేశారు. దాంతో మోడీ అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నారు. భారత్ గుండా పాక్ లోకి ప్రవహించే సింధు జలాలను నిలిపివేశారు. దాంతో గత అరవైఏళ్ళుగా ఎంతో సమృద్ధిగా ఈ నీటిని తాగుకు సాగుకూ వాడుకుంటున్న పాక్ దెబ్బకు షాక్ తిన్నది.
పాక్ దిగి వస్తుందా :
మోడీ మాత్రం పదే పదే ఒకే మాట చెబుతూ వచ్చారు నీరూ రక్తం ఒకే చోట కలిసి ప్రవహించవని, ఉగ్రవాదానికి పాక్ స్వస్తి చెబితేనే నీరు ఆ వైపుగా మళ్ళుతుందని కూడా సందేశం ఇచ్చారు. ఇపుడు చూస్తే పాక్ అల్లాడిపోతోంది. గొంతెండి పోయి గోల పెడుతోంది. దాంతో పాక్ భారత్ వైపు నీటి కోసం చూస్తోంది. పాక్ కి వ్యవసాయం మొత్తం సింధూ నదీ జలాల వల్లనే ఆధారపడి ఉన్నాయి. నీరు లేక దుర్భిక్షమైన పరిస్థితులు ఆ దేశంలో ఉంటున్నాయి. ఇపుడు పాక్ తన జనాల కోసం దేశం భారత్ తో రాజీకి వచ్చే చాన్స్ ఉందని అంతర్జాతీయ దౌత్య నిపుణులు అంటున్నారు. ఒక విధంగా దీనిని కాళ్ల బేరం కూడా అనుకోవచ్చు అని అంటున్నారు.
పాక్ ని కట్టడి చేసే వ్యూహం :
పాక్ తానుగా భారత్ తో చర్చలకు వచ్చినపుడు దానిని అన్ని విధాలుగా భారత్ తనకు అనుకూలంగా మార్చుకోవాలని దౌత్య నిపుణులు అంటున్నారు. భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు భారత్ కి దక్కేలా చూసుకోవాలని అంటున్నారు. దాదాపుగా ఎనిమిది దశాబ్దాలుగా భారత్ ని అన్ని రకాలుగా వేధిస్తున్న దాయాదికి చుక్కలు చూపించి లెక్కలు సరిచేసేలా ఈ చర్చలు ఉండాలని అంటున్నారు. పూర్తిగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీఘకాలిక వ్యూహాలను భారత్ అనుసరించాలని పాక్ కి ముకుతాడు వేసి పూర్తిగా కట్టడి చేసే లాగానే ఏ ఒప్పందం అయినా ఉండాలని కోరుతున్నారు.
అతి మంచితనంతోనే :
నిజానికి చూస్తే 1960 దశాబ్దంలో నాటి పాలకులు పాక్ మీద పూర్తి అభిమానం చూపించారు. పోనీ చిన్న దేశం సాటి దేశమని సింధూ జలాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అందులో చూస్తే ఏకంగా ఎనభై శాతం పైగా నీటిని పాక్ కి దక్కేలా ఒప్పందాలు చేసుకున్నారు. పాక్ దాయాది కదా అని ప్రేమతో మెజారిటీ వాటాను భారత్ వదులుకోవడం ప్రపంచంలోనే ఎక్కడా లేదని దౌత్య నిపుణులు అంటున్నారు. అయితే ఇపుడు పాక్ చర్చలకు వచ్చినా గతంలో మాదిరిగా ఎనభై శాతం నదీ జలాలు దక్కే సీన్ ఉండదని అంటున్నారు. భారత్ తన న్యాయమైన వాటాను తీసుకుంటుందని అందునా ఎగువ దేశంగా తనకు ఉన్న హక్కులను సదుపాయాలను వాడుకుంటుందని అంటున్నారు. అయితే మరో వైపు చూస్తే సింధూ జలాల నుంచి భారత్ ఇతర ప్రాజెక్టులకు అవసరాలకు ఇప్పటికే నీటిని మళ్ళిస్తూ చర్యలు తీసుకుంటోంది. ఇపుడు పాక్ మొసలి కన్నీరు కార్చి భారత్ ని మెప్పించాలని చూసినా కఠినంగా వ్యవహరించాలని అంతా కోరుతున్నారు.